Site icon NTV Telugu

Chitradurga murder case: డెత్ మిస్టరీ.. చిత్రదుర్గ్‌లో గండికోట తరహా కేసు

10

10

Chitradurga murder case: కడప జిల్లా గండికోటలో యువతి మృతిపై మిస్టరీ వీడనేలేదు. మళ్లీ అదే తరహాలో అనంతపురం జిల్లా చిత్రదుర్గ్‌లో మరో యువతి అదే స్థితిలో మృతి చెందింది. ఈ మిస్టరీ డెత్ వెనక ఎవరు ఉన్నారు? ఆమెను హత్య చేసింది ఎవరు? అసలు హత్యకు కారణాలేంటి అనే వాటిపై పోలీసుల దర్యాప్తు సాగుతోంది. ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు వర్షిత. ఆమె స్వస్థలం కర్ణాటకలోని హిరియూరు ప్రాంతం కోవేరహట్టి. ఈ అమ్మాయి ఏపీలోని చిత్రదుర్గ్‌లో బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. హస్టల్‌లో ఉంటో రోజూ కాలేజీకి వెళ్లి వస్తోంది..

READ ALSO: Young Woman Suicide: పెళ్లి చేసుకుంటానన్నాడు.. అంతా బాగుంది అనుకునే టైమ్‌లో..

పూర్తిగా కాలని మృతదేహం..
కానీ ఈ అమ్మాయిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గోనూరు శివారులోని పొలంలోకి తీసుకు వెళ్లి చంపేసినట్లు తెలుస్తోంది. అక్కడే మృతదేహాన్ని కూడా తగలబెట్టారు. కానీ అదే సమయంలో వర్షం పడడంతో మృతదేహం పూర్తి కాలలేదు. సగం కాలిపోయిన డెడ్ బాడీని చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు షురూ చేశారు.

చేతిపై ఉన్న టాటూ ఆధారంగా వర్షితగా గుర్తింపు
యువతి చేతిపై ఉన్న టాటూ ఆధారంగా వర్షితగా గుర్తించారు. అంతే కాదు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. పలు సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించారు. అందులో ఓ యువకుడితో ఆమె వెళ్లినట్లు గుర్తించారు. అతన్ని అనుమానితునిగా తీసుకు వచ్చారు. అతని పేరు చేతన్ కుమార్ అని చెబుతున్నారు. వర్షిత మృతితో ఆమె చదువుతున్న డిగ్రీ కాలేజీలో కలకలం రేగింది. ఆమెను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. క్లాసులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. దీంతో ఈ కేసులో తీవ్రత మరింత పెరిగింది. వర్షితకు శత్రువులు ఎవరూ లేరని ఆమె తల్లి చెబుతోంది.. మరోవైపు ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. అమ్మాయిలను కాలేజీకి పంపాలంటేనే భయమేస్తోందంటున్నారు పేరెంట్స్. యువతులకు ఎక్కడా రక్షణ లేకుండా పోయిందని చెబుతున్నారు. వర్షితను అంత దారుణంగా ఎవరు చంపారో.. వారిని కనిపెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

READ ALSO: Hyderabad family suicide: చిన్నారిని చంపి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారా?

Exit mobile version