NTV Telugu Site icon

Chhattisgarh: రక్షాబంధన్‌ రోజున ఘోరం.. మహిళపై సామూహిక అత్యాచారం

Chhattisgarh

Chhattisgarh

రక్షాబంధన్‌ రోజున ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో ఘోరం జరిగింది. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని స్థానికంగా జరుగుతున్న జాతరకు వెళ్తున్న గిరిజన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు తనను సమీపంలోని చెరువు ఒడ్డుకు బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 70(1), 351( 2) కింద కేసు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి: Minister Gottipati Ravi Kumar: విద్యుత్‌ షాక్‌తో విద్యార్థి మృతి.. ఈ ఘటనపై మంత్రి సీరియస్

ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ స్పందించారు. ఈ ఘటన చాలా తీవ్రమైందిగా పరిగణించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. అంతేకాకుండా బాధితురాలికి రక్షణ కల్పించాలని తెలిపారు. అలాగే బాధితురాలికి కావాల్సిన సాయాన్ని కూడా అందించాలని అధికారులు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు భూపేస్ ఎక్స్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Minister Gottipati Ravi Kumar: విద్యుత్‌ షాక్‌తో విద్యార్థి మృతి.. ఈ ఘటనపై మంత్రి సీరియస్

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. న్యాయం చేయాలని వైద్యులు, నర్సులు, మహిళా సంఘాలు ఆందోళనలు చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా.. అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. మహారాష్ట్రలో ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపులు జరగడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇలా ఎక్కడో చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Champai soren: చంపై సోరెన్ యూటర్న్.. కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు!