Chhattisgarh: అత్యాచారం కేసులో జైలుకు వెళ్లిన ఓ నిందితుడు పెరోల్‌పై రిలీజ్ అయి, మళ్లీ అదే నేరం చేశాడు. వావీవరసలు మరిచి మృగంగా ప్రవర్తించాడు. మైనర్లయిన తన కూతురు, మేనకోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. నిందితుడు అక్టోబర్ 19న అంబికాపూర్ జైలు నుంచి పెరోల్‌పై విడుదలయ్యాడు. 36 ఏళ్ల రేపిస్ట్ తన 11 ఏళ్ల కూతురు, 12 ఏళ్ల మేనకోడలుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 2020లో బంధువులు పాపపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
Read Also: BC Census: బీసీ గణన చేయాలని సీఎం చంద్రబాబుకు వినతి..
అక్టోబర్ 19న రాత్రి తన గదిలోకి తనపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని బాలిక పోలీసులకు చెప్పింది. రెండు రోజుల తర్వాత అక్టోబర్ 21, కలప సేకరించేందుకు కూతురిని అడవికి తీసుకెళ్లాడు, ఆ సమయంలో మళ్లీ అత్యాచారం చేసినట్లు బాలిక పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై అక్టోబర్ 22న కొరియా జిల్లాలోని బైకుంత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది.
బాలిక తండ్రిపై ఫిర్యాదు చేసిన కొద్దిసేపటికే, నిందితుడు తన మేనకోడలిపై అత్యాచారం చేసినట్లు తెలిపింది. అక్టోబర్ 21న ఈ ఘటన జరిగినట్లు బాలిక వెల్లడించింది. పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, చివరకు నిందితుడిని పట్టుకున్నారు. అక్టోబర్ 26న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.