Site icon NTV Telugu

Honey Trap : చేవెళ్లలో యోగా గురువుకు హనీట్రాప్.. రూ.50 లక్షలు వసూలు

Honey Trap

Honey Trap

Honey Trap : హైదరాబాద్‌ శివారులోని చేవెళ్లలో హనీట్రాప్ ఘటన సంచలనంగా మారింది. యోగా గురువును బలవంతంగా వలలో వేసి, పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసిన గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రంగారెడ్డి అనే యోగా గురువు యోగా ఆశ్రమం నిర్వహిస్తున్నారు. ఇటీవల ఇద్దరు మహిళలు అనారోగ్య సమస్యల పేరుతో ఆ ఆశ్రమంలో చేరారు. వారు ముందే పక్కా ప్రణాళికతో గురువుకు దగ్గరయ్యారు. కొద్ది రోజుల్లో ఆయన విశ్వాసాన్ని గెలుచుకొని, మరింత సన్నిహితంగా మెలిగారు.

Maruthi : బూతులు మాట్లాడితేనే సినిమాలు చూస్తున్నారు..

ఈ సమయంలో గురువు రంగారెడ్డితో కలసి ఫోటోలు, వీడియోలు తీశారు. ఆ కంటెంట్‌ను ‘అమర్ గ్యాంగ్’కు అందించారు. గ్యాంగ్ ఆ ఫోటోలు, వీడియోల ఆధారంగా యోగా గురువును బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టింది. మొదట్లో పెద్దగా పట్టించుకోని రంగారెడ్డి, తర్వాత పరిస్థితుల దృష్ట్యా గ్యాంగ్ ఒత్తిడికి层బబడి మొత్తం రూ.50 లక్షలు చెల్లించారు. అంతటితో ఆగని గ్యాంగ్ మరో రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇవ్వకపోతే వీడియోలు, ఫోటోలు బయటపెడతామని బెదిరించింది.

ఈ బెదిరింపులతో విసుగెత్తిపోయిన యోగా గురువు చివరకు గోల్కొండ పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో గ్యాంగ్‌లో కీలక పాత్ర పోషించిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ హనీట్రాప్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.

Post Office Savings Schemes: అధిక వడ్డీ ఇచ్చే స్కీమ్స్ టాప్ స్కీమ్స్ ఇవే..!

Exit mobile version