Chennai Girl Preethi Dies After Falling From Train: కేవలం ఒక సెల్‌ఫోన్ కోసం ఇద్దరు దుర్మార్గులు ఓ యువతి ప్రాణాలు తీసేశారు. కదులుతున్న రైలు నుంచి ఆమెని తోసేశారు. చివరికి ఆ యువతి మృత్యువుతో పోరాడుతూ.. ఆసుపత్రిలో మృతి చెందింది. దీంతో.. పోలీసులు కేసుని సీరియస్‌గా తీసుకొని, ఆ ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. చైన్నెలోని కందన్‌చావడిలో తిరువిక వీధికి చెందిన ప్రీతి(22) అనే యువతి కొట్టూరుపురంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఎప్పట్లాగే జులై 2వ తేదీన తన పని ముగించుకొని, సాయంత్రం సబర్బన్ రైలులో ఇంటికి బయలుదేరింది. తాను ఒక చోట కూర్చొని, సెల్‌ఫోన్ చూసుకుంటోంది.
Posani Krishna Murali: పవన్ కళ్యాణ్‌కి పోసాని సవాల్.. దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలి
సరిగ్గా అదే సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రీతి వద్దకు వచ్చి, ఆమె సెల్‌ఫోన్ దొంగలించడానికి ప్రయత్నించారు. ఆమె చేతిలో నుంచి లాక్కోవడానికి ట్రై చేశారు. అయితే.. ప్రీతి వెంటనే ప్రతిఘటించింది. ఆ ఇద్దరితో గొడవకు దిగింది. కోపాద్రిక్తులైన ఆ ఇద్దరు వ్యక్తులు.. రైలు ఇందిరా నగర్ స్టేషన్ సమీపంలోకి రాగానే ఆమెను కిందకు నెట్టేశారు. కదులుతున్న రైలు నుంచి కిందకు పడటంతో.. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి ప్రయాణికులు, రైల్వే పోలీసులు వెంటనే ప్రీతిని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. ప్రీతిని తోసేసిన ఆ ఇద్దరు వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే.. శనివారం వరకు మృత్యువుతో పోరాడిన ప్రీతి, శనివారం ఉదయం తుదిశ్వాస విడిచింది. గాయాలు చాలా తీవ్రంగా తగలడం వల్లే.. ప్రీతి మృత్యువాత పడింది.
Sudigali Sudheer: బీచ్ లో ‘గాలోడు’.. రష్మీనే ఫోటో తీసింది.. ?
కూతురు మృతితో ప్రీతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఉద్యోగం చేసుకుంటూ తమకు ఆసరాగా నిలిచిన నిలిచిన కూతురు ఇలా తిరిగిరాని లోకాలకి వెళ్లిపోవడంతో, వారి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అటు.. ప్రీతి మరణవార్త తెలుసుకుని, పోలీసులు తమ దర్యాప్తుని మరింత వేగవంతం చేశారు. రైల్వేస్టేషన్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల రికార్డులను పరిశీలించారు. ఎట్టకేలకు ఆ ఇద్దరి ఆచూకీ కనుగొని, అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితుల్ని విఘ్నేష్ (27), మణిమారన్ (26)గా గుర్తించారు.
