Site icon NTV Telugu

వాటెన్ ఐడియా… విగ్గులో బంగారం సీజ్

అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. షూస్, జీన్ ప్యాంట్ లు, ట్యాబ్లెట్లు, ఫైల్ ఫోలర్లు వేటీనీ వదిలిపెట్టడం లేదు. తాజాగా చెన్నై ఎయిర్ పోర్టులో ఓ మహిళ వేసిన ప్లాన్ ఫ్లాప్ అయింది. విదేశాలనుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. చెన్నై ఎయిర్ పోర్టులో కస్టమ్స్ తనిఖీల్లో 23 లక్షల విలువైన బంగారం పట్టుబడింది.

https://ntvtelugu.com/illegal-making-gudumba-in-villages/

ఓ మహిళ తల విగ్గులో బంగారం దాచి గుట్టుగా బయటపడదామని ప్లాన్ చేసింది. అయితే కస్టమ్స్ అధికారుల ముందు ఆమె ఆటలు సాగలేదు. విగ్గులో దాచిన బంగారం స్వాధీనం చేసుకున్నారు చెన్నై కస్టమ్స్ అధికారులు. శ్రీలంక నుంచి చెన్నైకి విమానంలో తలవెంట్రుకల్లో విగ్గులో దాచుకున్న 23 లక్షల విలువైన 525 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు అధికారులు. ఈ కేసుకి సంబంధించి ముగ్గురు మహిళలను చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశారు. వీరి వెనుక ఎవరు ఉన్నారనేది తెలుసుకునేందుకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కస్టమ్స్ అధికారులు సీజ్ చేసిన బంగారం

Exit mobile version