Delhi Gang Rape Case: యూఏఈ నుంచి కామాంధుడి అప్పగింత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Gang Rape Case: దేశ రాజధానిలో యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి విదేశాలకు పారిపోయిన కరుడుగట్టిన నిందితుడి ఆటకట్టింది. గల్ఫ్ దేశంలో తలదాచుకున్న కామాంధుడిని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) భారత్‌కు రప్పించింది. ఢిల్లీ పోలీసుల విజ్ఞప్తి మేరకు కేంద్ర విదేశాంగ శాఖ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్వయంతో పనిచేసిన సీబీఐ.. ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఎదుర్కొంటున్న సజీర్ పల్లి మోపమ్ను యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి బుధవారం విజయవంతంగా ఢిల్లీకి తరలించింది.
ఢిల్లీ పోలీసుల దర్యాప్తు వివరాల ప్రకారం.. నిందితుడు సజీర్ పల్లి మోపమ్ తన సహచరుడితో కలిసి ఓ 20 ఏళ్ల యువతికి బలవంతంగా మత్తుమందు తాగించాడు. స్పృహతప్పి నిస్సహాయ స్థితిలోకి వెళ్లిన బాధితురాలిని ఓ ప్రైవేట్ హోటల్‌కు తరలించాడు. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు ఫేక్ ఐడీలు ఉపయోగించి హోటల్లో గదిని తీసుకున్నాడు. అనంతరం ఆమెపై విచక్షణారహితంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. వైద్య, ఫోరెన్సిక్ నివేదికల్లోనూ ఈ దారుణం రుజువైంది. దీనిపై సమగ్ర దర్యాప్తు పూర్తి చేసిన ఢిల్లీ పోలీసులు ఇప్పటికే సంబంధిత న్యాయస్థానంలో పకడ్బందీ చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
Also Read
నేరం జరిగిన వెంటనే దేశం విడిచి పారిపోయిన నిందితుడిపై ఢిల్లీ పోలీసుల అభ్యర్థన మేరకు సీబీఐ ఇంటర్‌పోల్ ద్వారా ‘రెడ్ నోటీస్’ జారీ చేయించింది. భారత్‌లోని ఇంటర్‌పోల్ నేషనల్ సెంట్రల్ బ్యూరో అందించిన సమాచారంతో యూఏఈ భద్రతా బలగాలు నిందితుడి ఆచూకీ కనిపెట్టి అక్కడే అరెస్ట్ చేశాయి. న్యాయపరమైన ప్రక్రియలన్నీ పూర్తి కావడంతో యూఏఈ ప్రభుత్వం అతడిని భారత్‌కు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ఢిల్లీ పోలీసులకు చెందిన ప్రత్యేక ఎస్కార్ట్ బృందం యూఏఈకి వెళ్లింది. అక్కడ అధికారిక లాంఛనాల అనంతరం సజీర్ను తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు బుధవారం ఢిల్లీ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. భారత్‌లో ఇంటర్‌పోల్ వ్యవహారాలను పర్యవేక్షించే నేషనల్ సెంట్రల్ బ్యూరోగా సీబీఐ కీలక పాత్ర పోషిస్తోంది. ‘భారత్‌పోల్’ వేదిక ద్వారా దేశంలోని దర్యాప్తు సంస్థలన్నింటినీ అనుసంధానిస్తూ, విదేశీ భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకుంటోంది. తీవ్ర నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన పరారీ నేరగాళ్లను రప్పించడంలో భారత్ దూకుడు పెంచింది. ఈ క్రమంలో 2019 నుంచి ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి 278 మందికి పైగా అంతర్జాతీయ పరారీ నేరస్థులను విజయవంతంగా భారత్‌కు తీసుకొచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజావార్తలు
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..