Crime: లిక్కర్‌లో రకరకాల ప్లేవర్స్.. టేస్టులు ఉన్నట్టుగానే.. మందు బాబుల్లో కూడా చాలా షేడ్స్ ఉంటాయి.. మందు లోపలికి వెళ్లిన తర్వాత.. తన అసలు రూపాన్ని బయటపెట్టుకున్నేవాళ్లు కొందరైతే.. తనకు సంబంధంలేని విషయాల్లో కూడా వేలు పెట్టేవారు మరికొందరు.. ఇంకా కొందరైతే.. తన గురించి.. తానే గొప్పగా ఊహించుకుంటారు.. ఇంకా కొందరు గమ్మున ఉంటే.. మరికొందరు.. పక్కనోడిని గెలికేస్తుంటాడు.. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే. మద్యం మత్తులో డయల్ 100కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి ఏకంగా సీఎంను గంటలో చంపుతానంటూ వార్నింగ్ ఇచ్చాడు.. మంగళగిరి రత్నాలచెరువుకు చెందిన నాగేశ్వరరావు ఫుల్లుగా మందుతాగి.. డయల్ 100కు ఫోన్ చేశాడు. గంటలో సీఎంను చంపుతానని చెప్పాడు. దీంతో ఫోన్ కాల్ వివరాలను గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి పంపించారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. అయితే, కిడ్నీ ఇస్తే 30 లక్షల రూపాయాలు ఇస్తానని మీడియేటర్ మోసం చేశాడట.. 4 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి మోసం చేశాడని పొంతనలేని సమాధానం చెప్పడంతో నాగేశ్వరరావును ఎస్పీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు పోలీసులు..
Read Also: Nobel Peace Prize 2025: నోబెల్ శాంతి బహుమతి.. ట్రంప్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?.
