Live-in relationship: సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం.. లివ్ ఇన్ రిలేషన్‌లో మరో మర్డర్..
- సూట్‌కేసులో కాలిన స్థితిలో 22 ఏళ్ల మహిళ మృతదేహం..
- లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో మరో దారుణం..
- మహిళను హత్య చేసిన యువకుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Live-in relationship: శ్రద్ధవాకర్ దారుణ హత్య ‘‘లివ్ ఇన్ రిలేషన్ షిప్’’లో జరిగిన దారుణానికి ఉదాహారణగా మిగిలింది. అయితే, శ్రద్ధా తర్వాత కూడా ఇలా లివ్ ఇన్‌లో ఉంటున్న చాలా మంది మహిళలు తమ సహచరుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. తాజాగా ఢిల్లీలోని ఘాజీపూర్ లో కూడా ఇలాంటి దారుణమే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఘజియాబాద్‌లో ఓ సూట్‌కేస్‌లో కాలిపోయిన స్థితిలో నిర్జన ప్రదేశంలో కనిపించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం పూర్తిగా కాలినట్లు గుర్తించారు. హత్య, సాక్ష్యాలు నాశనం చేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు కేసులు నమోదు చేశారు.
తూర్పుఢిల్లీ డీసీసీ అభిషేక్ ధనియా మీడియాలో మాట్లాడుతూ.. ‘‘ మొదట మాకు ఎలాంటి ఆదారలు లభించలేదు. కాలిపోయిన మృతదేహం మాత్రమే ఉంది. సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేయడం ద్వారా విచారణ ప్రారంభించాము’’ అని చెప్పారు. మృతదేహాన్ని కనుగొనడానికి కొన్ని గంటల ముందు ఓ హ్యుందాయ్ వెర్నా కారు ఆ ప్రాంతాన్ని దాటినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు కార్ నెంబర్ ఆధారంగా లోనీ ప్రాంతంలోని ఓ వ్యక్తిని కనుగొన్నారు. అయితే, తాను ఆ కారుని అమిత్ తివారీ అనే వ్యక్తికి అమ్మినట్లు చెప్పారు.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
Read Also: East Central Railway Recruitment 2025: రైల్వేలో 1,154 పోస్టులు.. పరీక్ష లేకుండానే జాబ్ పొందే ఛాన్స్
సీసీటీవీ ఫుటేజ్ ట్రాక్ చేసిన తర్వాత పోలీసులు 22 ఏళ్ల అమిత్ తివారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అమిత్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ ఘజియాబాద్‌లో నివసిస్తున్నాడు. సీసీటీవీలో కనిపించి అతడి స్నేహితుడు అనుజ్ కుమార్‌ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతను వెల్డింగ్ మెకానిక్‌గా పనిచేస్తూ అదే ప్రాంతంలో నివసిస్తున్నాడు. అమిత్‌ని ప్రశ్నించగా, ఆ మృతదేహాన్ని 22 ఏళ్ల తన కజిన్ శిల్పా పాండేగా గుర్తించాడు. అమిత్, శిల్పతో రిలేషన్ ఉందని, వారు ఒక ఏడాది కాలంగా కలిసి ఉంటున్నట్లు చెప్పారు. శిల్ప అతడిని వివాహం చేసుకోవాలని అనుకుంది, కానీ అమిత్ మాత్రం ఆమెతో విడిపోవడానికి ప్రయత్నించాడని తెలిసింది.
శనివారం రాత్రి అమిత్ మద్యం తాగి శిల్పతో గొడవపడ్డాడని, ఆవేశంలో అతను ఆమె గొంతు కోసి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని సూట్‌కేస్‌లో ప్యాక్ చేసి, మృతదేహాన్ని పడేయడానికి సాయం చేయమని తన స్నేహితుడు అనుజ్‌ని కోరినట్లు తెలిసింది. శిల్ప, అమిత్‌కి బంధువు. తనతో జీవించడానికి కుటుంబాన్ని వదిలేయాలని శిల్ప అమిత్‌ని కోరింది. అమిత్, అతడి కుటుంబాన్ని తప్పుడు కేసులో ఇరికిస్తానని శిల్ప బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు. శిల్ప మృతదేహాన్ని నాశనం చేయడానికి అమిత్‌కి అనుజ్ సహకరించినట్లు తేలింది.
ముందుగా మృతదేహాన్ని పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌లో మారుమూల ప్రాంతంలో పడేయాలని అనుకున్నారు. అయితే, రెండు చెక్ పోస్టులు దాటిన తర్వాత, ఒక పెట్రోల్ పంప్ నుంచి రూ.160తో డిజిల్ కొనుగోలు చేశారు. నిర్జన ప్రదేశంలో శిల్ప ఉన్న సూట్‌కేస్ పడేసి, దానికి నిప్పటించారు. గ్రేటర్ నోయిడాలో అమిత్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. శిల్ప తల్లిదండ్రులు సూరత్‌లో నివసిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
తాజావార్తలు
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!