ఓ అన్న చెల్లెలికి మరణశాసనం రాశాడు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థినికి చిన్న వయసులోనే నిండు నూరేళ్లు నిండిపోయాయి. చదువుకోకుండా ప్రేమ వ్యవహారం నడిపించడంతో సోదరుడు జీర్ణించుకోలేక చెరువులో ముంచి ప్రాణాలు తీశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో సంచలన విషయాలు.. ఖాతాలో రూ.కోటి జమ
నిత్య యాదవ్(19) 12వ తరగతి చదువుతోంది. సోదరుడు ఆదిత్యతో కలిసి ఉంటుంది. ఆదిత్యకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. తండ్రి చనిపోవడంతో సోదరీమణుల చదువు బాధ్యతలను ఆదిత్యనే చూసుకుంటున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో నివాసం ఉంటున్నారు. ఆదిత్య నిత్యం కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని నడిపిస్తున్నాడు.
అయితే మూడేళ్ల నుంచి నిత్య యాదవ్ ప్రేమ వ్యవహారం నడిపిస్తోంది. ఒక వ్యక్తితో రహస్యంగా తిరుగుతున్నట్లు ఆదిత్య గమనించాడు. ఇక మధ్యలో నిత్య యాదవ్ నుదిట సిందూరం కనిపించింది. దీనిపై అన్నాచెల్లెల మధ్య ఘర్షణ జరుగుతోంది. దీంతో ప్రేమ వ్యవహారం బయటపడింది. అయితే ఆదివారం నిత్య ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి వరకు తిరిగి రాలేదు. మరుసటి రోజు ప్రేమికుడితో కలిసి రెస్టారెంట్‌లో ఆదిత్యకు కనిపించింది. నచ్చజెప్పి నిత్యను ఇంటికి రప్పించే ప్రయత్నం చేశాడు. నిత్య కూడా మనసు మార్చుకుని అన్నతో ఇంటికి బయల్దేరింది. అనంతరం ఇంటికి రెండున్నర కిలోమీటర్ల దూరంంలో ఉన్న ఏకాంత ప్రాంతానికి తీసుకెళ్లి చెరువులో ముంచి నిత్య ప్రాణాలు తీశాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి చంపేసినట్లుగా సమాచారం అందించాడు. ప్రేమ వ్యవహారం కారణంగానే తన 19 ఏళ్ల సోదరి నిత్య యాదవ్‌ను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు.
ఇది కూడా చదవండి: CJI Gavai: పశ్చాత్తాపం లేదు.. గవాయ్‌పై నిందితుడు మరోసారి పరుష వ్యాఖ్యలు
నిత్యను కొట్టడంతో తలకు గాయం అయి.. కాలువలోకి తోసేసినట్లు పోలీసులకు చెప్పాడు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపారు. ఆదిత్యను అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని గోరఖ్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ జితేంద్ర శ్రీవాస్తవ తెలిపారు.
