Bride Killed: మరికొన్ని గంటల్లో ఒక్కటి కాబోతోన్నారు. కానీ, పెళ్లికి ఒక గంట ముందు వధువు దారుణహత్యకు గురైంది. కాబోయే భర్త చేతుల్లో హత్యకు గురైంది. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని భావ్‌నగర్‌లో జరిగింది. బాధితురాలిని సోనీ హిమ్మత్ రాథోడ్‌గ గుర్తించారు. నిందితుడు సాజన్ బరైయా చేతిలో ఆమె ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ జంటకు శనివారం వివాహం జరగాల్సి ఉంది. పెళ్లికి ఒక గంట ముందు ఈ దారుణం చోటు చేసుకోవడంతో వధువు కుటుంబం కన్నీరుమున్నీరు అవుతోంది.
Read Also: Bihar: బీహార్ పవర్ షేరింగ్.. ఎన్డీయేలో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులంటే?
చీర , డబ్బు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం తర్వాత ఈ హత్య చోటు చేసుకుంది. ప్రభుదాస్ సర్సులోని టెక్రీ చౌక్ సమీపంలో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు వివరాల ప్రకారం, నిందితుడు సాజర్ బరయ్య, బాధితురాలు సోనీ హిమ్మత్ రాథోడ్‌కు ఏడాదిన్నరగా కలిసి నివసిస్తున్నారు. వారికి ఇటీవల నిశ్చితార్థం జరిగింది. శనివారం రాత్రి వివాహం జరగాల్సి ఉంది. అయితే చీర, డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య చెలరేగిన వాదన హత్యకు దారి తీసినట్లు, కోపంతో సాజన్, సోనీ తలపై ఇనుప పైపుతో కొట్టడంతో తల పలిగి చనిపోయింది. ఇరు కుటుంబాలకు ఈ పెళ్లిపై పెద్దగా ఇష్టం లేకున్నా, వీరిద్దరు కలిసి జీవిస్తున్నారని తెలిసింది.
