Site icon NTV Telugu

Boyfriend Kills Woman: 20 ఏళ్ల యువతిని కత్తితో పొడిచి హత్య చేసిన బాయ్‌ఫ్రెండ్..

Mumbai Crime

Mumbai Crime

Boyfriend Kills Woman: ప్రేమ వ్యవహారాలు, సహజీవనాలు హత్యలకు కారణమవుతున్నాయి. తాజాగా ముంబైలో ఓ వ్యక్తి, తన లవర్‌ని అత్యంత దారుణంగా హతమార్చాడు. 20 ఏళ్ల యువతిని ఆమె ప్రియుడు కత్తితో పొడిచి హత్య చేసి, మృతదేహాన్ని పొదల్లో పారేసినట్లు శనివారం పోలీసులు వెల్లడించారు. నవీ ముంబైలోని ఉరాన్ రైల్వే స్టేషన్ సమీపంలోని పొదల్లో యువతి మృతదేహం ఉన్నట్లు తెల్లవారుజామున 2 గంటలకు పోలీసులకు కాల్ వచ్చినట్లు డీసీపీ వివేక్ పన్సారే తెలిపారు.

Read Also: MP Shocker: పోర్న్‌ని చూసి దారుణం.. 9 ఏళ్ల సోదరిపై 13 ఏళ్ల బాలుడి అత్యాచారం, హత్య..

యువతి శరీరంపై అనేక గాయాలు, కత్తిపోట్లు ఉన్నట్లు, దారుణంగా హత్య చేయబడినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోందని పోలీసులు తెలిపారు. హత్యకు గురైన మహిళను యశశ్రీ షిండేగా గుర్తించారు. ఆమె కనిపించకుండాపోయినట్లు ఫిర్యాదు నమోదైంది. ఉరాన్‌కి చెందిన యశశ్రీ పని నిమిత్తం 25 కి.మీ దూరంలోని బెలాపూర్ వెళ్తుంటుంది. ప్రేమ వ్యవహారమే యువతి హత్యకు కారణమైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. హత్య జరిగిన తర్వాత నుంచి ఆమె ప్రియుడు కూడా కనిపించకుండా పోయాడు. యువతి బాయ్‌ఫ్రెండ్ ప్రధాన నిందితుడని తెలుస్తోంది. అతడిని కనిపెట్టేందుకు 5 టీంలను పోలీసులు ఏర్పాటు చేసి, గాలిస్తున్నారు.

Exit mobile version