NTV Telugu Site icon

Crime: అక్రమ సంబంధం అనుమానం.. ప్రియుడిపై 20సార్లు కత్తిపోట్లు

Crime News 1

Crime News 1

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. తన భార్యతో అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో ప్రియుడిని 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు భర్త. కాగా.. రెండ్రోజుల తర్వాత ఈ హత్య ఉదంతం బయట పడింది. వివరాల్లోకి వెళ్తే.. భర్త కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. ఈ క్రమంలోనే తన భార్యతో ప్రియుడు మనోజ్‌కు ఫోన్ చేయించాడు.

Read Also: IPL 2025: మొహ్సిన్ ఖాన్ స్థానంలో బరిలోకి దిగనున్న శార్దూల్ ఠాకూర్‌..

అయితే ఈ విషయం తెలియక వస్తున్న ప్రియుడు మనోజ్‌పై భర్త మహేంద్ర కుమార్‌ తన వద్ద తుపాకీకి ఉండే కత్తితో దాదాపు 20 సార్లు పొడిచాడు. దీంతో.. మనోజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అంతేకాకుండా.. మనోజ్ తో పాటు వచ్చిన అతని స్నేహితుడు రోహిత్ లోధిని కానిస్టేబుల్ చంపేశాడు. అయితే.. శుక్రవారం రాత్రి లఖింపూర్‌లోని నాగ్వా వంతెన సమీపంలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసు దర్యాప్తులో కానిస్టేబుల్ ఈ హత్యను ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసి చంపాడని తేలింది.

Read Also: Taraka Rama : ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త ప్రయోగం “పూర్ణ చందర్ రావు”

మనోజ్ పై 20 కత్తిపోట్లు ఉండగా.. స్నేహితుడు రోహిత్ మెడపై ఒక గాయాన్ని పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో నిందితుడి భార్యకు కూడా గాయాలయ్యాయి. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఆమె వేలుకు ఛాపర్ తగిలి తెగిపోయింది. కాగా.. ఈ హత్య తర్వాత నిందితుడు లఖింపూర్‌కు పారిపోయాడు. అయితే.. పోలీసులు అతని మొబైల్ రికార్డులను ట్రాక్ చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని భార్యను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విచారణలో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు అంగీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.