NTV Telugu Site icon

Girlfriend Birthday: బర్త్‌డే కోసం ప్రియురాలి ఇంటికెళ్లాడు.. తీరా కిచెన్ రూంలో చూస్తే ఊహించని షాక్

Boyfirned Suicide

Boyfirned Suicide

Boyfriend Commits Suicide In Girlfriend House After Celebrating Her Birthday: ప్రియురాలి పుట్టినరోజుని ఘనంగా జరుపుకోవడం కోసం ఆమె ఇంటికెళ్లిన ఓ యువకుడు.. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చూసి ఖంగుతిన్న అతని ప్రియురాలు కూడా సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ప్రదీప్ (26), కావ్య (26) ఇద్దరూ స్కూల్ ఫ్రెండ్స్. నీలగిరి జిల్లా మసినగుడి మేయర్‌ ప్రాంతంలో నివాసముంటున్నాడు. చిన్నప్పుడు కలిసి చదువుకున్న వీళ్లిద్దరు.. గత ఆరు నెలల నుంచి ప్రేమించుకుంటున్నారు. ప్రదీప్‌ మైసూరులోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుండగా.. కావ్య బీలమెట్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.

Ravindranath-Gayatri: చిక్కుల్లో పన్నీరు సెల్వం కొడుకు.. మహిళ దెబ్బకు ప్రమాదంలో ఎంపీ పోస్టు

కట్ చేస్తే.. మంగళవారం కావ్య పుట్టినరోజు కావడంతో, సంబరాలు జరుపుకోవడం కోసం ప్రదీప్ సోమవారం సాయంత్రమే ఆమె ఇంటికి వెళ్లాడు. అర్థరాత్రి బర్త్‌డే వేడుకలు జరుపుకున్నారు. మంగళవారం ఉదయం కావ్యకి తల్లి నుంచి ఫోన్ రావడంతో.. ఆమె ఫోన్ తీసుకొని మేడపైకి వెళ్లింది. తల్లితో కాసేపు మాట్లాడిన అనంతరం.. కిందకు దిగొచ్చింది. బెడ్రూంలో ప్రదీప్ కనిపించకపోయేసరికి.. ఇంట్లో అతని కోసం వెతికింది. ఈ క్రమంలోనే వంటగదిలోకి వెళ్లి చూడగా.. ప్రదీప్‌ ఉరివేసుకుని కనిపించాడు. దీంతో షాక్‌కు గురైన కావ్య గట్టిగా కేకలు వేసింది. చుట్టుపక్కల వారి సహాయంతో ప్రదీప్‌ని కిందకు దించి, 108 సాయంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ప్రదీప్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Maruti Brezza Price 2023: కేవలం 5 లక్షలకే మారుతి బ్రెజా.. రోడ్ టాక్స్ కూడా అవసరం లేదు!

ప్రదీప్ మృతితో తీవ్ర భయాందోళనలకు గురైన కావ్య.. ఇంటికెళ్లి ఆత్మహత్యకు యత్నించింది. ఇది గమనించిన స్థానికులు.. ఆమెను రక్షించి, ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అసలు ప్రదీప్ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు? అనే విషయం ఇంకా మిస్టరీగానే మారింది. ఆ మిస్టరీని ఛేధించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

Show comments