Girlfriend Birthday: బర్త్‌డే కోసం ప్రియురాలి ఇంటికెళ్లాడు.. తీరా కిచెన్ రూంలో చూస్తే ఊహించని షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boyfriend Commits Suicide In Girlfriend House After Celebrating Her Birthday: ప్రియురాలి పుట్టినరోజుని ఘనంగా జరుపుకోవడం కోసం ఆమె ఇంటికెళ్లిన ఓ యువకుడు.. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చూసి ఖంగుతిన్న అతని ప్రియురాలు కూడా సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ప్రదీప్ (26), కావ్య (26) ఇద్దరూ స్కూల్ ఫ్రెండ్స్. నీలగిరి జిల్లా మసినగుడి మేయర్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. చిన్నప్పుడు కలిసి చదువుకున్న వీళ్లిద్దరు.. గత ఆరు నెలల నుంచి ప్రేమించుకుంటున్నారు. ప్రదీప్ మైసూరులోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుండగా.. కావ్య బీలమెట్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.
Ravindranath-Gayatri: చిక్కుల్లో పన్నీరు సెల్వం కొడుకు.. మహిళ దెబ్బకు ప్రమాదంలో ఎంపీ పోస్టు
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
కట్ చేస్తే.. మంగళవారం కావ్య పుట్టినరోజు కావడంతో, సంబరాలు జరుపుకోవడం కోసం ప్రదీప్ సోమవారం సాయంత్రమే ఆమె ఇంటికి వెళ్లాడు. అర్థరాత్రి బర్త్‌డే వేడుకలు జరుపుకున్నారు. మంగళవారం ఉదయం కావ్యకి తల్లి నుంచి ఫోన్ రావడంతో.. ఆమె ఫోన్ తీసుకొని మేడపైకి వెళ్లింది. తల్లితో కాసేపు మాట్లాడిన అనంతరం.. కిందకు దిగొచ్చింది. బెడ్రూంలో ప్రదీప్ కనిపించకపోయేసరికి.. ఇంట్లో అతని కోసం వెతికింది. ఈ క్రమంలోనే వంటగదిలోకి వెళ్లి చూడగా.. ప్రదీప్ ఉరివేసుకుని కనిపించాడు. దీంతో షాక్‌కు గురైన కావ్య గట్టిగా కేకలు వేసింది. చుట్టుపక్కల వారి సహాయంతో ప్రదీప్‌ని కిందకు దించి, 108 సాయంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ప్రదీప్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Maruti Brezza Price 2023: కేవలం 5 లక్షలకే మారుతి బ్రెజా.. రోడ్ టాక్స్ కూడా అవసరం లేదు!
ప్రదీప్ మృతితో తీవ్ర భయాందోళనలకు గురైన కావ్య.. ఇంటికెళ్లి ఆత్మహత్యకు యత్నించింది. ఇది గమనించిన స్థానికులు.. ఆమెను రక్షించి, ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అసలు ప్రదీప్ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు? అనే విషయం ఇంకా మిస్టరీగానే మారింది. ఆ మిస్టరీని ఛేధించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!