Site icon NTV Telugu

Kerala: ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త నివాసం సమీపంలో బాంబు పేలుడు..

Bomb Explosion

Bomb Explosion

Kerala: కేరళలో కన్నూర్‌లోని చావస్సేరిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కార్యకర్త ఇంటి ముందు గురువారం రాత్రి బాంబు పేలింది. మట్టన్నూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త సుధీష్ ఇంటికి 50 మీటర్ల దూరంలో బాంబు పేలింది. పేలుడు చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించింది. డాగ్ స్క్వాడ్ కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించింది.

Punjab: పీఎస్‌లోనే రివాల్వర్‌తో కాల్చుకుని ఏఎస్సై ఆత్మహత్య.. వీడియో రికార్డు చేసి మరీ..

అనంతరం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. సుధీష్ కూడా పలు కేసుల్లో నిందితుడని పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ జరుగుతోంది. గత నెలలో జరిగిన బాంబు పేలుడు తర్వాత ఓ ప్రాంతంలో ఆర్‌ఎస్‌ఎస్‌, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగడం గమనార్హం. ఈ ఘర్షణలో పలు ఇళ్లు, ఆస్తులు దెబ్బతిన్నాయి. మరో సంఘటనలో కన్నవంలో శుక్రవారం ఎస్‌డీపీఐ మాజీ కార్యకర్త సలాహుద్దీన్ ఇంటి సమీపంలో బాంబు పేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Exit mobile version