Site icon NTV Telugu

Chattisghar: ర్యాపిడో డబ్బులు అడిగితే.. మరీ ఇలా చేస్తారా..

Untitled Design (20)

Untitled Design (20)

చత్తీస్ గఢ్ బిలాస్ పూర్ దారుణం చోటుచేసుకుంది. ర్యాపిడో బుక్ చేసుకున్న ఓ మహిళ తన గమ్య స్థానానికి చేరుకున్న తర్వాత.. డబ్బులు అడిగితే డ్రైవర్ కళ్లలో కారం కొట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది.

Read Also: Telangana: దారుణం.. లిప్ట్ ఇచ్చి మహిళ హత్య

పూర్తి వివరాల్లోకి వెళితే..బిలాస్‌పూర్‌లో దారుణ ఘటన జరిగింది. ర్యాపిడో బుక్ చేసుకున్న మహిళను డబ్బులు ఇవ్వమని అడిగితే.. అతడితో గొడవ పెట్టుకుని.. కళ్లలో కారం పొడి చల్లింది. మరో మహిళ ఇంకో యువకుడిపై దాడికి యత్నించింది. గొడవ సమయంలో, మహిళలు తమ ముఖాలను మరియు వారి స్కూటర్ లైసెన్స్ ప్లేట్‌ను కప్పుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు మండిపడుతున్నారు. భారతీయ మహిళల సాధికారత అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. పురుషులపై దాడి చేసేందుకు కారణం చట్టంలోని లొసుగులు మాత్రమేనని.. న్యాయస్థానాలు, చట్టాలు కేవలం మహిళలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: Amazon: అమెజాన్ లో బిల్లు వ్యాల్యూపై 10శాతం తగ్గింపు

Exit mobile version