Site icon NTV Telugu

Love Marriage Issue: డామిట్.. కథ అడ్డం తిరిగింది.. సెల్ఫీ కుట్ర మెడకు చుట్టుకుంది

Man Push Wife On Hill

Man Push Wife On Hill

Bihar Man Tried To Kill His Pregnant Wife By Pushing Her From Hill: వాళ్లిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల పాటు వారి దాంపత్య జీవితం సజావుగానే సాగింది. కానీ.. భార్య గర్భం దాల్చిన విషయం తెలిసి భర్తలో ఊహించని మార్పు వచ్చింది. భార్యను వదిలించుకోవాలని ఒక కుట్ర పన్నాడు. ‘సెల్ఫీ’ పేరుతో తన భార్యని ఒక కొండపైకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై రాయితో దాడి చేసి, ఆ కొండపై నుంచి కిందకు తోసేశాడు. అనంతరం భార్య చనిపోయిందనుకొని అక్కడి నుంచి పారిపోయాడు. కానీ.. కథలో ఒక షాకింగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. కొండపై నుంచి కింద పడినా.. ఆమె చనిపోలేదు. ప్రాణాలతో బయటపడింది. దీంతో.. భర్త కటకటాలపాలయ్యాడు. బిహార్‌లో చోటు చేసుకున్న ఆ వివరాల్లోకి వెళ్తే..

Kim Cotton: పురుషుల క్రికెట్‌లో లేడీ అంపైర్.. చరిత్రలో ఇదే తొలిసారి

2019లో రాజ్‌ రంజన్‌ మిశ్రా, నిషా కుమారి (20) ప్రేమ వివాహం చేసుకున్నారు. బెగుసరాయ్‌ జిల్లాలోని సాహెబ్‌పూర్‌ కమల్‌‌లో తారాబన్నా గ్రామంలో వారు కాపురం పెట్టారు. నాలుగు సంవత్సరాల పాటు వీరి సంసార జీవితం సజావుగా సాగింది. అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు తప్పితే.. వీరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. అయితే.. ఇటీవల నిషా గర్భం దాల్చిన తర్వాత భర్తలో మార్పు వచ్చింది. ఆమెను వదిలించుకోవాలన్న ఉద్దేశంతో.. హత్యకు ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే అతడు ఒక కొత్త కారు కొన్నాడు. ఆ కారుకు పూజ చేయించేందుకు.. ఆదివారం భార్యభర్తలు కలిసి గుడికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో.. ఒక కొండ దగ్గర రాజ్‌రంజన్ కారుని ఆపి, సెల్ఫీలు దిగుదామని నిషాకి చెప్పాడు. కొండపైకి వెళ్లగానే.. నిషాపై రంజన్ రాయితో దాడి చేశాడు. అనంతరం కొండపై నుంచి కిందకు తోసేశాడు. ఈ ఘటనలో నిషా చనిపోయి ఉంటుందని భావించి, అక్కడి నుంచి ఏమీ ఎరుగనట్టుగా జారుకున్నాడు.

Punjab Kings: పంజాబ్ జట్టులో కీలక మార్పు.. ఆల్‌రౌండర్ స్థానంలో అతడు

అయితే.. అంత పెద్ద ప్రమాదం నుంచి కూడా నిషా ప్రాణాలతో బయటపడింది. ఆమె చనిపోలేదు. తీవ్ర గాయాలతో కింద పడి ఉండటంతో.. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న తర్వాత వెంటనే పోలీసులను ఆసుపత్రికి రప్పించి.. జరిగిన తతంగాన్ని వారికి వినిపించింది. తనపై రాజ్ రంజన్ దాడి చేయడానికి ముందే.. మత్తు మందు కలిపిన చిప్స్ తినిపించాడని తన ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం కొండపైకి తీసుకెళ్లి బండరాయితో కొట్టాడని, ఆ తర్వాత కిందకు తోసేశాడని తెలిపింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రాజ్ రంజన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version