NTV Telugu Site icon

Pune Prostitution: పూణెలో వ్యభిచారం గుట్టు రట్టు.. బాలీవుడ్ నటి అరెస్ట్

Bhojpuri Actress Prostituti

Bhojpuri Actress Prostituti

Bhojpuri Actresses Booked For Running Prostitution In Pune Five Star Hotel: ఒక ఆపరేషన్‌లో భాగంగా.. పింపిరి చించ్‌వాడ్ క్రైమ్ బ్రాంచ్ టీమ్ పూణెలోని వాకడ్ ఏరియాలో ఉన్న ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో వ్యభిచారం గుట్టు రట్టు చేసింది. ఈ కేసులో ఒక భోజ్‌పురి నటితో పాటు మరో మోడల్ అరెస్ట్ అయ్యారు. ఈ హోటల్‌లో వ్యభిచారం దందా సాగుతోందని పోలీసులకు శుక్రవారం సాయంత్రం సమాచారం అందింది. దీంతో.. అధికారులు పక్కా స్కెచ్ వేసి, హోటల్‌పై దాడి చేశారు. ఆ హోటల్‌లో వారికి ఇద్దరు మహిళలు (భోజ్‌పురి నటి, మోడల్), ఒక ఏజెంట్ పట్టుబడ్డారు. నిందితుడు ఆ మహిళల్ని మభ్యపెట్టి వ్యభిచారం నడుపుతున్నాడని.. విటుల నుంచి ఒక రాత్రికి రూ.25 వేలు, మధ్యాహ్నానికి రూ.15 వేలు వసూలు చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.

Priyanka Gandhi: “రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వం”.. ప్రియాంకా గాంధీ కీలక వ్యాఖ్యలు..

పోలీస్ ఇన్‌స్పెక్టర్ దేవేంద్ర చవాన్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ.. ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో ఏజెంట్‌తో కలిసి భోజ్‌పురి నటి, మోడల్ వ్యభిచారం నడుపుతున్నట్టు తమకు పక్కా సమాచారం అందిందని తెలిపారు. ఇది నిజమో, కాదో తేల్చడానికి తాము విచారణలో భాగంగా ఒక ఫేక్ కస్టమర్‌ను పంపించామని.. ఆన్‌లైన్‌లో ఏజెంట్‌ని సంప్రదించామని అన్నారు. అప్పుడు ఏజెంట్.. ఆ ఫైవ్ స్టార్ హోటల్‌లో రూమ్ బుక్ చేసుకోమని చెప్పాడని, అనంతరం భోజ్‌పురి నటితో పాటు ఒక మోడల్ ఫోటోని షేర్ చేశాడని చెప్పారు. ఏజెంట్ చెప్పినట్లుగానే తమ డమ్మీ కస్టమర్ ఆ హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్నాడని, అలాగే ఫోటోల్లో చూపించినట్టు నటితో పాటు మోడల్ అక్కడికి చేరుకున్నారని తెలియజేశారు. అప్పుడు వ్యభిచారం జరుగుతోందని నిజమేనని తమ డమ్మీ కస్టర్ నిర్ధారించుకొని తమకు సమాచారం అందించాడన్నారు. వెంటనే తాము హోటల్‌పై దాడి చేసి, ఏజెంట్ సహా ఆ ఇద్దరు మహిళల్ని అరెస్ట్ చేశామని వివరించారు.

Raghav Chadha : బాలీవుడ్ భామతో రాఘవ్ చద్దా నిశ్చితార్థం

ఈ వ్యభిచారం కేసులో పట్టుబడ్డ వారిపై ఐపీసీ సెక్షన్స్ 370(3), 34, 1956 ఇమ్మోరల్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్‌తో పాటు రూ.30 వేల వరకు నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలియజేశారు. తమ విచారణలో భాగంగా.. ఏజెంత్ ఆ ఇద్దరు మహిళలకు (నటి, మోడల్) డబ్బు ఆశ చూపించి, బలవంతంగా వారి చేత ఈ పాడు పని చేయిస్తున్నాడని తేలిందని అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి హస్తం ఉందన్న కోణంలో తాము దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.