Site icon NTV Telugu

Bengaluru: మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్.. కారు ఢీకొని యువతి మృతి

Bengaluru

Bengaluru

పూణె ర్యాష్ డ్రైవింగ్ ఘటన దేశాన్ని కుదిపేసింది. మైనర్లు అత్యంత వేగంగా కారు నడిపి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల మరణానికి కారణమయ్యారు. పోలీసులు ఓ వైపు కఠిన చర్యలు చేపట్టినా.. ర్యాష్ డ్రైవింగ్‌లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా బెంగళూరులో కూడా ఇదే తరహాలో ఘటన చోటుచేసుకుంది. తాగిన మత్తులో అత్యంత వేగంగా మెర్సిడెస్ కారు నడపడంతో 30 ఏళ్ల యువతిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు (20) పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ఇది కూడా చదవండి: Ponguleti Srinivas Reddy : వరంగల్‌ వాసులకు శుభవార్త.. ఇది మామూలు ముచ్చట కాదు..!

కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంగేరి మెట్రో స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి 30 ఏళ్ల సంధ్య రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తోంది. అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న 20 ఏళ్ల విద్యార్థి ధనుష్‌ తన తండ్రి మెర్సిడెస్ బెంజ్ కారుతో వేగంగా వస్తూ ఆమెను ఢీకొట్టాడు. దీంతో సంధ్య అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదం తర్వాత నిందితుడు అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించగా.. స్థానికులు అతన్ని పట్టుకొని చితకబాదారు. సమాచారం అందుకున్న కెంగేరి పోలీసులు నిందితుడు ధనుష్‌తోపాటు అతని స్నేహితుడుని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

ఇది కూడా చదవండి: Andhra Pradesh: దేవాలయాల్లో అర్చకులకు కనీస వేతనం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం

నిందితుడు ప్రైవేట్ బస్ ట్రావెల్ కంపెనీ యజమాని వీర శివ కుమారుడు ధనుష్‌గా గుర్తించారు. అతని తండ్రి ఇటీవలే లగ్జరీ కారు మెర్సిడెస్‌ బెంజ్‌ను కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో ధనుష్ ఈ కారును తీసుకొని యశ్వంత్‌పూర్ సమీపంలోని ఒక మాల్‌కు స్నేహితుడితో కలిసి వెళ్లాడు. ఇద్దరు అక్కడ మద్యం తాగి మైసూరు రోడ్డుకు లాంగ్ డ్రైవ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కారు నడుపుతున్న ధనుష్ అతివేగంతో కెంగేరి స్టేషన్ కు చేరుకోగానే స్పీడ్ బ్రేకర్ ను గమనించలేక వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. రోడ్డు దాటుతున్న మహిళను ఢీ కొట్టాడు.

ఇది కూడా చదవండి: First Kiss: “తొలి ముద్దు”కు దూరమవుతున్న జపాన్ హైస్కూల్ స్టూడెంట్స్..

Exit mobile version