Cyber Crime: డేటింగ్ యాప్‌లో కలిశాడు.. మహిళని నిండా దోచేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Woman Cheated By Her Boyfriend Who Met on Dating App: ఈతరం యువతలో డేటింగ్ యాప్స్‌కి ఉన్న క్రేజే వేరు. కొత్త స్నేహితుల్ని, పార్ట్నర్స్‌ని ఈ డేటింగ్ యాప్‌ల ద్వారా వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో రకరకాల డేటింగ్ యాప్‌లు పుట్టుకొచ్చేశాయి. దీంతో.. సైబర్ నేరగాళ్లు ఇక్కడ కూడా తిష్టవేశారు. ప్రేమ పేరుతో యువతీ, యువకులకు గాలం వేసి.. లక్షలు, కోట్లలో డబ్బులు దోచేసుకుంటున్నారు. తీరా అవతలి వ్యక్తికి అనుమానం వచ్చాక.. అందుబాటులో లేకుండా మాయం అవుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో వెలుగు చూశాయి. తాజాగా ఓ మహిళ కూడా ఇలాగే మోసపోయింది. డేటింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తితో కలవకుండా ప్రేమలో పడ్డ ఆ మహిళ.. అతడు అడిగినప్పుడల్లా డబ్బులు పంపించింది. చివరికి అనుమానం వచ్చి ప్రశ్నిస్తే.. ఆ సైబర్ నేరగాడు పత్తా లేకుండా పోయాడు. దాంతో ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Congress: రాజస్థాన్ సంక్షోభంపై కాంగ్రెస్ కీలక సమావేశం.. గెహ్లాట్, పైలెట్ మధ్య సఖ్యత కుదిరేనా..?
Also Read
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో 37 ఏళ్ల మహిళ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తోంది. ఈమెకు మూడు నెలల క్రితం ఒక డేటింగ్ యాప్‌లో అద్విక్ చోప్రా అనే పేరుతో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. తనది ముంబై అని, లండన్‌లో మెడిసిన్ చదువుతున్నానని అతగాడు చెప్పాడు. ఇక అప్పటి నుంచి ఇద్దరు చాటింగ్ చేసుకోవడం, ఫోన్‌లో మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే అతగాడు తన మాయమాటలతో ఆమెను బుట్టలో వేసుకున్నాడు. నిన్ను చూడలేక ఉండలేకపోతున్నానని, నిన్ను కలిసేందుకు త్వరలోనే బెంగళూరు వస్తానని చెప్పాడు. లండన్ నుంచి ఢిల్లీకి వచ్చానని పేర్కొన్నాడు. అయితే.. తన వద్ద ఖర్చులకు డబ్బులు లేవని, కొంత డబ్బు పంపించాలని కోరాడు. అతని ప్రేమలో ఉన్న సదరు మహిళ.. అడగ్గానే సంకోచించకుండా డబ్బులు పంపింది. ఇలా మూడు దఫాల్లో రూ.4.5 లక్షలు అతని ఖాతాలో జమ చేసింది. ఒకసారి అతగాడు ఓ ఎమర్జెన్సీ పని ఉందని, అందుకు తనకు రూ.6 లక్షలు డబ్బు అవసరం ఉందని, త్వరగా ఆ డబ్బులు పంపించాలని డిమాండ్ చేశాడు.
Divya Bharathi : ఉప్పెంగే అందాలతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేయకు తట్టుకోలేరు
ఇంతకీ ఏంటా అవసరం? అని మహిళ ప్రశ్నించగా.. అద్విక్ పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో.. ఆమెకి అనుమానం వచ్చింది. అదే విషయమై అతడ్ని ప్రశ్నించగా.. అద్విక్ వెంటనే కాల్ చేశాడు. అనంతరం స్విచ్చాఫ్ చేసేశాడు. యాప్‌లో తన ప్రొఫైల్‌ని కూడా తొలగించాడు. అప్పుడు తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రేమ పేరుతో తనని అద్విక్ చోప్రా మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంటూ.. అతనికి సంబంధించిన వివరాలు ఇచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!