NTV Telugu Site icon

Cyber Crime: డేటింగ్ యాప్‌లో కలిశాడు.. మహిళని నిండా దోచేశాడు

Woman Cheated By Boyfriend

Woman Cheated By Boyfriend

Bengaluru Woman Cheated By Her Boyfriend Who Met on Dating App: ఈతరం యువతలో డేటింగ్ యాప్స్‌కి ఉన్న క్రేజే వేరు. కొత్త స్నేహితుల్ని, పార్ట్నర్స్‌ని ఈ డేటింగ్ యాప్‌ల ద్వారా వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో రకరకాల డేటింగ్ యాప్‌లు పుట్టుకొచ్చేశాయి. దీంతో.. సైబర్ నేరగాళ్లు ఇక్కడ కూడా తిష్టవేశారు. ప్రేమ పేరుతో యువతీ, యువకులకు గాలం వేసి.. లక్షలు, కోట్లలో డబ్బులు దోచేసుకుంటున్నారు. తీరా అవతలి వ్యక్తికి అనుమానం వచ్చాక.. అందుబాటులో లేకుండా మాయం అవుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో వెలుగు చూశాయి. తాజాగా ఓ మహిళ కూడా ఇలాగే మోసపోయింది. డేటింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తితో కలవకుండా ప్రేమలో పడ్డ ఆ మహిళ.. అతడు అడిగినప్పుడల్లా డబ్బులు పంపించింది. చివరికి అనుమానం వచ్చి ప్రశ్నిస్తే.. ఆ సైబర్ నేరగాడు పత్తా లేకుండా పోయాడు. దాంతో ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Congress: రాజస్థాన్ సంక్షోభంపై కాంగ్రెస్ కీలక సమావేశం.. గెహ్లాట్, పైలెట్ మధ్య సఖ్యత కుదిరేనా..?

బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో 37 ఏళ్ల మహిళ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తోంది. ఈమెకు మూడు నెలల క్రితం ఒక డేటింగ్ యాప్‌లో అద్విక్‌ చోప్రా అనే పేరుతో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. తనది ముంబై అని, లండన్‌లో మెడిసిన్ చదువుతున్నానని అతగాడు చెప్పాడు. ఇక అప్పటి నుంచి ఇద్దరు చాటింగ్ చేసుకోవడం, ఫోన్‌లో మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే అతగాడు తన మాయమాటలతో ఆమెను బుట్టలో వేసుకున్నాడు. నిన్ను చూడలేక ఉండలేకపోతున్నానని, నిన్ను కలిసేందుకు త్వరలోనే బెంగళూరు వస్తానని చెప్పాడు. లండన్ నుంచి ఢిల్లీకి వచ్చానని పేర్కొన్నాడు. అయితే.. తన వద్ద ఖర్చులకు డబ్బులు లేవని, కొంత డబ్బు పంపించాలని కోరాడు. అతని ప్రేమలో ఉన్న సదరు మహిళ.. అడగ్గానే సంకోచించకుండా డబ్బులు పంపింది. ఇలా మూడు దఫాల్లో రూ.4.5 లక్షలు అతని ఖాతాలో జమ చేసింది. ఒకసారి అతగాడు ఓ ఎమర్జెన్సీ పని ఉందని, అందుకు తనకు రూ.6 లక్షలు డబ్బు అవసరం ఉందని, త్వరగా ఆ డబ్బులు పంపించాలని డిమాండ్ చేశాడు.

Divya Bharathi : ఉప్పెంగే అందాలతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేయకు తట్టుకోలేరు

ఇంతకీ ఏంటా అవసరం? అని మహిళ ప్రశ్నించగా.. అద్విక్ పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో.. ఆమెకి అనుమానం వచ్చింది. అదే విషయమై అతడ్ని ప్రశ్నించగా.. అద్విక్ వెంటనే కాల్ చేశాడు. అనంతరం స్విచ్చాఫ్ చేసేశాడు. యాప్‌లో తన ప్రొఫైల్‌ని కూడా తొలగించాడు. అప్పుడు తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రేమ పేరుతో తనని అద్విక్ చోప్రా మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంటూ.. అతనికి సంబంధించిన వివరాలు ఇచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.