Crime: చెల్లెలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బావమరిది దారుణహత్య..

  • బెంగళూర్‌లో దారుణ సంఘటన..
  • చెల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న బావమరిది హత్య..
Crime

Crime

Crime: బెంగళూర్‌లో దారుణ సంఘటన జరిగింది. తన చెల్లెలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో సొంత బావమరిదిని ఒక వ్యక్తి హత్య చేశాడు. మృతదేహంతో పాటు తన కారుతో నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. బైరప్పనహల్లికి చెందిన డాగ్ కెన్నెల్ ఓనర్ అయిన శ్రీనివాస్‌ను నిందితుడిగా గుర్తించారు. మృతుడు 24 ఏళ్ల రంజిత్‌గా తేలింది.

Read Also: Dhurandhar 2: బాహుబలి రికార్డ్స్ అవుట్.. తొమ్మిదేళ్ల రికార్డును బద్దలుకొట్టిన ధురంధర్ 2!

రంజిత్ శ్రీనివాస్ భార్య తమ్ముడు. అప్పటికే పెళ్లయిన తన చెల్లిలితో రంజిత్ అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని శ్రీనివాస్ అనుమానించాడు. దీంతో వీరిద్దరి మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ వివాదాన్ని పరిష్కరించే నెపంతో రంజిత్‌ను శ్రీనివాస్ నిర్మానుష్య ప్రాంతానికి రావాల్సిందిగా కోరాడు. వచ్చిన వెంటనే రంజిత్ తలపై దాడి చేసి హత్య చేశాడు. హత్య తర్వాత నేరుగా నిందితుడు శ్రీనివాస్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ విషయంపై తదుపరి విచారణ జరుగుతోంది.