NTV Telugu Site icon

Crime: బ్యూటీషియన్ మిస్సింగ్.. 6 ముక్కలుగా శరీరం..

Crime

Crime

Crime: రాజస్థాన్‌లో రెండు రోజలు క్రితం అదృశ్యమైన 50 ఏళ్ల బ్యూటీషియన్ శరీర భాగాలు ఒక ప్లాస్టిక్ బ్యాగులో కనిపించాయి. మహిళను ఆమెకు తెలిసిన వ్యక్తి హత్య చేసి, ఆమె శరీర భాగాలను ఆరు ముక్కలు చేసిన నిందితుడు, ఇంటి సమీపంలో పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 28న బాధితురాలు అనితా చౌదరి మధ్యాహ్నం తన బ్యూటీ పార్లర్ మూసేసిన తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. మరుసటి రోజు ఆమె భర్త మన్మోహన్ చౌదరి జోధ్‌పైర్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు.

Read Also: Lucky Baskhar Review: లక్కీ భాస్కర్ రివ్యూ

అనిత బ్యూటీ పార్లర్ ఉన్న భవనంలోనే నిందితుడు గులాముద్దీన్ అలియాస్ గుల్ మహ్మద్ దుకాణం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇద్దరికి పరిచయం ఏర్పడింది. బాధితురాలి ఫోన్ కాల్ డేటా ప్రకారం.. నిందితుడు గుల్ మహ్మద్ గురించి పోలీసులకు తెలిసింది. సర్దార్‌పురా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ దిలీప్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ అనిత కనిపించకుండా పోయే ముందు ఆటోలో అక్కడి నుంచి వెళ్లిపోయిందని, అనితను తీసుకెళ్లిన ఆటోడ్రైవర్‌ను పోలీసులు ప్రశ్నించగా, నిందితుడు ఉంటున్న గాన్‌గానా వద్దకు తీసుకెళ్లాడని చెప్పాడు.

పోలీసులు అక్కడకు చేరుకుని గుల్ మహ్మద్ ఇంటిని గుర్తించారు. అతని భార్య ఆచూకీ లభించగా, ఆమె గత మూడు రోజులుగా తన సోదరి ఇంట్లో ఉంటున్నట్లు పోలీసులకు చెప్పింది. ఆమె తన ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అనితని హత్య చేసి, మృతదేహాన్ని ఇంటి వెనక పూడ్చిపెట్టినట్లు తన భర్త చెప్పాడని ఆమె చెప్పింది. పోలీసులు బుల్డోజర్ సాయంతో 12 అడుగుల గుంత తవ్వగా, అని శరీరం మొండెం, చేతులు, కాళ్లు లభించాయి. రెండు ప్లాస్టిక్ సంచుల్లో విడివిడి చుట్టిన స్థితిలో ఉన్నాయి. తన తల్లిని మోసం చేసి హత్య చేసినట్లు అనిత కుమారుడు ఆరోపించాడు. నిందితుడిని పట్టుకునేందుక పోలీసులు జోధ్‌పూర్‌లోని వివిధ ప్రాంతాల్లో వెతుకుతున్నారు.

Show comments