Site icon NTV Telugu

Shocking : బాలాపూర్ లో దారుణం.. మందుతాగుదమని పిలిచి..

Crime

Crime

మందు తాగుదామని చెప్పి మత్తులోకి చేరుకున్నాక స్నేహితుడిపై పెట్రోల్ పోసి నిప్పటించిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపుతుంది. ఎర్రకుంటకు చెందిన అబ్దుల్ ఫతేలి ఆటోడ్రైవర్ (32) వృత్తి రిత్యా ఆటోడ్రైవర్. పాతబస్తీకి చెందిన ఆటోడ్రైవర్ జహంగీర్ లు స్నేహితులు. వీరిద్దరు తరచు మద్యం సేవిస్తుంటారు. ఈ నేపధ్యంలోనే అబ్దుల్ ఫతేలికి మద్యం తాగుతామని చెప్పి జహంగీర్ మద్యంతో పాటు ఒక బాటిల్లో పెట్రోల్ తీసుకుని బాలాపూర్ బారామల్గి వెనుక వైపుకు వచ్చాడు. ఇద్దరు కలిసి మద్యం సేవించాక మత్తులోకి చేరుకున్న అబ్దుల్ ఫతేలిపై జహంగీర్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 50శాతం కాలిన గాయాలతో అబ్దుల్ ఫతేలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసును బాలాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Ravi Teja : రవితేజ సంచలన సినిమా.. చేస్తే మామూలుగా ఉండదు

Exit mobile version