Site icon NTV Telugu

Madya Pradesh: దారుణం.. తల్లిని కోడళ్లు కొట్టి చంపుతుంటే చూస్తూ నిల్చున్న కొడుకు..

Crime News

Crime News

Madya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిని కొట్టి చంపుతుంటే కొడుకు చూస్తూ నిలబడిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు కోడళ్లు అత్తపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన రాష్ట్రంలోని గ్వాలియర్ జిల్లాలో జరిగింది బాధితురాలిని మున్నీ దేవీ(55)గా గుర్తించారు. తీవ్రగాయాలపాలైన మున్నీదేవీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

ఈ కేసులో మున్నీదేవీ పెద్ద కోడలు సావిత్ర, చిన్న కోడలు చందా, పెద్ద కుమారుడు ధర్మేంద్రతో పాటు చిన్న కోడలు తండ్రి, ఇద్దరు సోదరులపై కేసు నమోదైంది. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. మార్చి 7న జిల్లాలోని అంత్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిప్రిపుర గ్రామంలో మున్నీదేవీ అనే వృద్ధురాలని కొట్టి చంపిన వీడియో వైరల్ కావడంతో ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. కోడళ్లు ఇద్దరు కర్రలు, రాళ్లతో మున్నీదేవిపై దాడి చేశారు. అక్కడే ఉన్న కొడుకు ఈ దాడిని అడ్డుకోకపోగా, దాడిని సమర్థించడం వీడియో కనిపించింది.

Read Also: Salman Khan Firing: సల్మాన్ ఇంటిపై కాల్పుల ఘటనలో కీలక ఆధారాలు లభ్యం!

ప్రాథమిక విచారణ ప్రకారం.. రెండేళ్ల క్రితం పెద్ద కోడలు సావిత్రి, అత్త మున్నీదేవీపై దాడి చేయడంతో ఆమె తలకు ఆరు కుట్లు పడ్డాయి. ఈ ఘటన తర్వాత అత్తా -కోడలు వేరుగా ఉంటున్నారు. అయితే చిన్న కుమారుడు రవికి దాతియా నివాసి చందా కుమారితో వివాహం జరిగింది. పెద్ద కోడలు, చిన్న కోడలు మధ్య పరిచయం బలపడటం మున్నీదేవికి నచ్చలేదు. దీంతో చందాకుమారిని వేధించడం ప్రారంభిచినట్లు తెలుస్తోంది. ఈ విషయమై చందా తన తండ్రి అమర్ సింగ్, సోదరులు అజయ్, విజయ్ సమక్షంలో పంచాయతీ పెట్టింది. అయితే, చర్చల్ని సీరియస్‌గా పట్టించుకోకపోవడంతో అత్త మున్నీదేవీపై పెద్ద కోడలు సావిత్రి దాడి ప్రారంభించింది. తర్వాత చిన్న కోడలు కూడా దాడిలో పాలు పంచుకుంది. కొడుకు ఉన్న కూడా దాడిని ఆపకుండా, తన భార్యను సపోర్టు చేశాడు. మున్నీదేవి పరిస్థితి విషమంగా ఉండటంతో గ్వాలియన్ లోని జయరోగ్య ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆమె మరణిచించింది.

Exit mobile version