Site icon NTV Telugu

Badminton coach: 16 ఏళ్ల బాలికపై బాడ్మింటన్ కోచ్ అత్యాచారం.. మొబైల్‌‌లో బాలికల నగ్న చిత్రాలు..

Badminton Coach

Badminton Coach

Badminton coach: బెంగళూర్‌కి చెందిన ఒక బ్యాడ్మింటన్ కోచ్ 16 ఏళ్ల మైనర్ బాలికపై పలు సందర్భాల్లో అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అతడి ఫోన్‌లో 7-8 మంది బాలిక అభ్యంతరకమైన చిత్రాలు ఉన్నాయనే ఆరోపణలతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన 26 ఏళ్ల నిందితుడు సురేష్ బాలాజీ హులిమావులోని బాడ్మింటన్ శిక్షణ కేంద్రంలో పనిచేస్తున్నాడు. బాధిత బాలిక గత రెండు ఏళ్లుగా అక్కడే శిక్షణ పొందుతోంది.

Read Also: Waqf Act: “వక్ఫ్ చట్టాన్ని” వెనక్కి తీసుకునే వరకు దేశవ్యాప్త నిరసన.. ముస్లిం సంస్థ హెచ్చరిక..

కోచింగ్ ముసుగులో సురేష్ బాలికను తన ఇంటికి తీసుకెళ్లి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు. సెలవుల కోసం బాలిక తన అమ్మమ్మ ఇంటికి వెళ్లే క్రమంలో, ఆమె అమ్మమ్మ ఫోన్ నుంచి వాట్సాప్ ద్వారా తన నగ్న ఫోటోలను కోచ్‌కి పంపింది. ఈ విషయాన్ని బాలిక అమ్మమ్మ గమనించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె తల్లి నిలదీయగా, బాలిక కోచ్ లైంగిక వేధింపుల గురించి చెప్పింది.

ఈ ఘటనపై పోలీస్ అధికారి మాట్లాడుతూ.. నిందితుడైన కోచ్ సురేష్‌ దాదాపుగా బాలికను 25 సార్లు తన ఇంటికి తీసుకెళ్లినట్లు చెప్పింది. బాలిక డ్యాన్స్ క్లాసులు, ట్యూషన్లకు వెళ్లకుండా కోచ్ ఇంటికి వెళ్లేదని, అతను ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు పోలీసులు చెప్పారు. విచారణలో, బాలికతో తాను లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. నిందితుడి ఫోన్‌ని పోలీసులు చెక్ చేసినప్పుడు 13-16 ఏళ్ల వయసు గల ఏడు ఎనిమిది మంది బాలికల నగ్న ఫోటోలు, వీడియోలు కనిపించాయి. నిందితుడు సురేష్ బాలాజీని పోలీసులు 8 రోజుల కస్టడీకి తీసుకున్నారు. బాలిక, కోచ్‌ని కలిసిన ప్రతీసారి బట్టలు ఉతికేది, దీంతో ఆధారాలు సేకరించేందుకు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version