Site icon NTV Telugu

Nandyal Crime: నంద్యాలలో దారుణం.. అందరూ చూస్తుండగానే..

Nandyal

Nandyal

Nandyal Crime: నంద్యాలలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది.. పట్ట లోని సలీమ్ నగర్ ప్రాంతానికి చెందిన ఫరూక్ ఆటో డ్రైవర్ ఫరూక్‌.. రైల్వే స్టేషన్ లో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ కింద దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.. రైలు ప్లాట్‌ఫామ్‌ మీద ఆగడానికి వస్తున్న సమయంలో ఆటో డ్రైవర్ ఫరూక్ పట్టాలపైకి దూకాడు. క్షణాల్లో రైలు అతనిపై నుంచి దూసుకెళ్లింది.. దీంతో, రెండు కాళ్లు తెగి పది నిమిషాల సేపు మృత్యువుతో పోరాడి చనిపోయాడు.. ఈ దారుణ సంఘటన చూసి భయాందోళనకు గురయ్యారు వందలాది మంది ప్రయాణికులు..

Read Also: Karnataka : కర్ణాటక మంత్రివర్గ సమావేశం.. అంతర్గత రిజర్వేషన్ల అమలుపై కమిటీ

మృతుడు ఫరూక్‌కు భార్య , ముగ్గురు కుమార్తెలు , కుమారుడు ఉన్నారని చెబుతున్నారు.. కుటుంబ పోషణతో అప్పుల భారమై ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నమాట.. రైల్వే స్టేషన్ లో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ కోసం ప్రయాణికులు ఎదురుచూస్తుండగా.. భద్రతగా ఉన్న ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది అలెర్ట్ గా ఉన్న సమయంలో పరిగెత్తుకుంటూ వచ్చి , ప్లాట్ ఫారమ్‌ నుండి రైలు కిందికి దూకాడు ఫరూక్.. క్షణాల్లో రైలు అతనిపై దూసుకెళ్లి , రెండు కాళ్లు తెగిపడ్డాయి.. దాదాపు పది నిమిషాల సేపు మృతువుతో పోరాడి ఒడి, తుది శ్వాస వదిలాడు. ఈ హృదయవిదార సంఘటనను సెల్ ఫోన్లలో తీశారు ప్రయాణికులు. ఫరూక్ మృతదేహాన్ని నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు రైల్వే పోలీసులు.

Exit mobile version