NTV Telugu Site icon

Assam : రూ. 68.41 కోట్ల విలువైన డ్రగ్స్ ను సీజ్ చేసిన అధికారులు..

Drugs

Drugs

డ్రగ్స్ అనే పదం కూడా వినిపించకూడదని అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ పట్టుకుంటున్న కూడా డ్రగ్స్ దొరుకుతూనే ఉంది.. మత్తుకు బానిసలుగా మారి యూత్ జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించిన వినడం లేదు.. మొన్న భారీగా గంజాయిని పట్టుకున్న అధికారులు.. తాజాగా మరోసారి కోట్ల విలువైన డ్రగ్స్ ను అధికారులు సీజ్ చేశారు..

మిజోరంలో రెండు వేర్వేరు ఆపరేషన్లలో రూ.68.41 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని, ముగ్గురిని అరెస్టు చేసినట్లు అస్సాం రైఫిల్స్ శుక్రవారం తెలిపింది.. పక్కా సమాచారం మేరకు అస్సాం రైఫిల్స్ సిబ్బంది సియాహా జిల్లాలోని బుల్పుయ్ గ్రామంలో దాడి చేసి 225 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 1.75 కోట్ల విలువైన హెరాయిన్‌ను బుధవారం స్వాధీనం చేసుకున్నామని, దీనికి సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు..

గురువారం జరిగిన మరో ఆపరేషన్‌లో, చంపై జిల్లాలోని జోఖౌతార్-మెల్‌బుక్ రోడ్‌లో 22.2 కిలోల బరువున్న 20 ప్యాకెట్ల మెథాంఫేటమిన్ మాత్రలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. రూ.66.66 కోట్ల విలువైన డ్రగ్స్‌ను లీగల్ ప్రొసీడింగ్‌ల కోసం ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్ విభాగానికి అప్పగించారు. సీజ్‌కు సంబంధించి ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు అస్సాం రైఫిల్స్ తెలిపింది..