Site icon NTV Telugu

S*exual Assault: పూజారి ముసుగులో కీచక పనులు.. అమ్మాయిపై అరాచకం..!

Crime News

Crime News

: పూజారి ముసుగులో ఒకడు.. జ్యోతిష్యుడి ముసుగులో ఒకడు.. మహిళలపై పడుతున్నారు. వికృత చేష్టలతో విరుచుకుపడుతున్నారు. పవిత్రమైన వృత్తులు చేసుకుంటున్నట్లు నటిస్తూ.. లోపల మాత్రం తింగరి వేషాలు వేస్తున్నారు. అలాంటి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మచిలీపట్నంలో మంచి పూజారిగా నటిస్తూనే బాలికను గర్భిణీని చేసిన వ్యక్తిని కటకటాల్లోకి నెట్టారు. మరోవైపు నాసిక్‌లో కీచక జ్యోతిష్యుడి అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

పోలీసుల వెనుక ముసుగులో ఉన్న ఈ వ్యక్తి పేరు రఘునాథ శర్మ. వృత్తిరీత్యా పూజారి. కృష్ణా జిల్లా మచిలీపట్నం లక్ష్మణరావుపురంలోని రామాలయంలో అర్చకుడిగా పని చేస్తున్నాడు. దగ్గరలోని నిజాంపేటలో భార్యాతో కలిసి నివాసం ఉంటున్నాడు. ప్రతిరోజు రామాలయంలో పూజలు చేస్తూ దేవుని స్మరిస్తూ ఉంటాడు. భక్తులు.. ఆ పూజారి వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటారు. మరి ఇంత మంచి వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో ఎందుకు ఉన్నాడనేగా మీ డౌట్. పేరుకు రఘనాథ శర్మ పూజారి అయినప్పటికీ ఆ ముసుగులో కీచక పనులు చేస్తున్నాడు. అందుకే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకు వచ్చారు.

China and Russia Back Cuba: క్యూబా కోసం ఏకమైన చైనా-రష్యా.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు..

భక్తిశ్రద్ధలతో ఉండాల్సిన అర్చకుడు కాస్తా బరితెగించాడు. ఈ పూజారి నీచపు బుద్ధి అర్చక వృత్తికే కళంకం తెచ్చింది. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ బాలిక.. రఘునాథ శర్మ కుటుంబంతో సన్నిహితంగా ఉంటుంది. అర్చకుడు భార్య ఆ యువతిని తన కుటుంబంలో ఒకరిగా.. ఇంటి మనిషిగా చూసుకుంటుంది. కానీ అర్చకుడు మాత్రం ఆమెను వక్రబుద్ధితోనే చూశాడు. దీనిని భార్య ఏమాత్రం గ్రహించలేదు. అర్చకుడు రఘునాథ శర్మ ఆ బాలికను ఒంటరిగా ఉన్న సమయం చూసి లైంగికంగా వేధించటం మొదలుపెట్టాడు. తన లైంగిక వాంఛ తీర్చాలని ఆమెను బలవంతం చేసేవాడు. అర్చకుని కామ కోరికను తీర్చేందుకు ఒప్పుకోకపోవడంతో ఆమెని బెదిరించి వశపరచుకున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే యువతి అంతు చూస్తానన్నాడు.

దేవునికి పూజలు చేసి పాపాలకు పాల్పడుతున్న ఆ పూజారి ఆటకు దేవుడు ముగింపు పలికాడు. అర్చకుడు బాలికతో శారీరక వాంఛ తీర్చుకొని గర్భం దాల్చడం బయటపడింది. దీంతో తల్లిదండ్రులు అర్చకుడిపై మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేసిన పోలీసులు కీచక అర్చకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.మరోవైపు మహారాష్ట్రలో ఎప్‌స్టీన్ ఫైల్స్ లాంటి ఘటన సంచలనం రేపుతోంది. నాసిక్‌కు చెందిన జ్యోతిషుడు అశోక్ కారత్‌ తన వద్దకు వచ్చే మహిళలకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేసేవాడని పోలీసులు గుర్తించారు. వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ దోపిడీ చేసేవాడన్నారు. అతడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

Hyundai Exter: మిడిల్ క్లాస్ ఫేవరెట్.. సన్‌రూఫ్, డాష్‌క్యామ్‌తో హ్యుందాయ్ ఎక్స్టర్ విడుదల

ఇప్పుడు జ్యోతిష్యుడు అశోక్ కారత్ అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అతని ఫాంహౌస్‌లో రహస్య కెమెరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఫామ్ హౌస్‌లోనే మహిళలపై అత్యాచారాలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి సాక్ష్యాలను కూడా సేకరించారు. మహిళలపై అత్యాచారం చేసే సమయంలో రహస్యంగా వీడియోలు తీసి ఆ తర్వాత వాటిని ఉపయోగించి బ్లాక్ మెయిల్ చేసినట్లు అధికారుల విచారణలో బయటపడింది. ఇందుకు సంబంధించి స్పై కెమెరాలతో పాటు పెద్ద ఎత్తున పెన్ డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ పెన్ డ్రైవ్‌లలో పెద్ద ఎత్తున మహిళలకు సంబంధించి అభ్యంతరకర అసభ్యకరమైన న్యూడ్ వీడియోలు ఉన్నట్లుగా తెలుస్తోంది. పెన్‌డ్రైవ్‌లలో 58 మంది మహిళల వీడియోలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు..

ఆధ్యాత్మికత ముసుగులో 35 ఏళ్ల మహిళపై పదేపదే అత్యాచారానికి పాల్పడిన అశోక్ కారత్‌ను అరెస్ట్ చేసినట్లు నాసిక్ పోలీసులు తెలిపారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం తనను పూజలు చేసే నెపంతో మత్తు మందు ఇచ్చి.. ఆ తర్వాత లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఇదే ఫాంహౌస్‌లో పలు రహస్య కెమెరాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మరోవైపు అశోక్ కారత్.. తనను రిటైర్డ్ మర్చంట్ నేవీ అధికారిగా చెప్పుకునేవాడు. ఈ కేసు విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో రాజకీయం నేతలతో అశోక్‌కు సంబంధాలు ఉన్నాయని సమాచారం. దీంతో ఈ కేసు మరింత సంచలనం కలిగిస్తోంది.

Exit mobile version