NTV Telugu Site icon

Drishyam Style Murder: “దృశ్యం” తరహాలో ప్రియురాలిని హత్య చేసిన ఆర్మీ జవాన్..

Army Soldier

Army Soldier

Drishyam Style Murder: మహరాష్ట్ర నాగ్‌పూర్‌లో ఒక ఆర్మీ జవాన్ ‘‘దృశ్యం’’ సినిమా తరహాలో తన ప్రియురాలిని హత్య చేశాడు. ఆ నేరంలో నిందితుడిని నాగ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు మంగళవారం తెలిపారు. ఆగస్టు 28న 32 ఏళ్ల జ్యోత్స్నా ఆక్రేని అజయ్ వాంఖడే(33) హత్య చేశాడు. నాగ్‌పూర్‌లోని కైలాస్ నగర్‌కి చెందిన నిందితులు నాగాలాండ్‌లో పనిచేస్తున్నాడు. వివరాల ప్రకరాం.. ఇద్దరూ ఒక మ్యాట్రిమోనీ పోర్టల్ ద్వారా కలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ రొమాంటిక్ రిలేషన్ ప్రారంభించారు.

అయితే, జ్యోత్స్నాకి అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే నిందితుడు అజయ్ వాంకెడే కుటుంబం వీరిద్దరి పెళ్లికి ఒప్పుకోలేదు. అతడికి వేరే మహిళతో వివాహం జరిగింది. దీంతో వాంకడే, జ్యోత్స్నతో దూరం పెంచుకున్నాడు. ఆమెని వదిలించుకునేందుకు హత్య ప్లాన్ చేసి ఉండొచ్చని అధికారులు తెలిపారు.

Read Also: CM Chandrababu: రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

వాంఖడే, జ్యోత్స్నాకి మత్తుమందు ఇచ్చి, ఆమె గొంతు కోసి చంపేసి, ఆపై ఆమె మృతదేహాన్ని నాగ్‌పూర్ జిల్లాలోని ఒక నిర్మాణుష్య ప్రాంతంలో పాతిపెట్టాడు. నేరాన్ని కప్పిపుచ్చేందుకు పాతిపెట్టిన ప్రాంతాన్ని సిమెంట్‌తో కప్పేశాడు. అంతకుముందు జ్యోత్స్నా తన నుంచి తప్పించుకు తిరుగుతున్న వాంఖడే వివరాలను అతడి స్నేహితుడి నుంచి అడిగి తెలుసుకుంది. జ్యోత్స్నా నీ గురించి అడుగుతోందని వాంఖడే ఫ్రెండ్ అతడికి చెప్పాడు.

పరిస్థితిని గమనించిన అజయ్ వాంకడే, జ్యోత్స్నాని అడ్డుతప్పుంచుకునేందుకు హత్యకు ప్లాన్ చేశాడు. ఆగస్టు 28న తన తల్లి మొబైల్ ఫోన్ ద్వారా జ్యోత్స్నాకి ఫోన్ చేసి కలుద్దామని వార్ధారోడ్‌కి రమ్మన్నాడు. తాను ఫ్రెండ్‌ని కలిసేందుకు వెళ్తున్నానని, మరుసటి రోజు ఇంటికి వస్తానని జ్యోత్స్నా తన కుటుంబీలకు చెప్పింది. వాంకడే, జ్యోత్స్నా ఇద్దరూ వార్ధా రోడ్‌లో కలుసుకుని ఒక హోటల్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చాడు.

స్పృహ కోల్పోయిన తర్వాత ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆమె మొబైల్ ఫోన్ విసిరేశాడు. ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బెల్తరోడ్ పోలీసుకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఎంక్వైరీలో ఇద్దరి మధ్య కాల్స్ ఉన్నట్లు కనుగొన్నారు. వాంఖడేని విచారణకి పోలీసులు పిలిచారు. అయితే, పరిస్థితిని గమనించిన అతను బీపీ చికిత్స కోసం పూణే ఆర్మీ మెడికల్ కాలేజీలో చేరాడు. ఆ తర్వాత నాగ్‌పూర్ సెషన్స్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశారు, కోర్టు తిరస్కరించడంతో హైకోర్టుని ఆశ్రయించాడు, సెప్టెంబర్ 15న అతడి పిటిషన్ తిరస్కరించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో సంఘటన స్థలం నుంచి సోమవారం మృతదేహాన్ని వెలికితీశారు.