NTV Telugu Site icon

AP Crime: రూ.4 కోట్లు ముంచిన రాంగ్‌ కాల్..!

Ap Crime

Ap Crime

AP Crime: కొన్ని రాంగ్‌ కాల్స్‌.. కొందరికి కొత్త పరిచయాలను అందిస్తే.. మరికొందరి జీవితాల్లో ప్రేమ చిగురించేలా చేయడం.. ఇంకా కొందరి జీవితాలను సర్వనాశనం చేసిన సందర్భాల్లో ఎన్నో చూశాం.. తాజాగా, ఓ రాంగ్ కాల్ విలువ అక్షరాల 4 కోట్ల రూపాయల వరకు వెళ్లింది.. ముక్కు మొహం తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఆ మహిళాకు ముచ్చేమటలు పట్టించింది.. సుమారు రూ. 4 కోట్లు వదిలించింది.. ఏళ్ల పాటు నరకం చూడాల్సిన పరిస్థితి వచ్చింది..

Read Also: UP: ‘‘ముస్లింలు మాత్రమే కాదు, హిందువులు కూడా’’.. రోడ్‌లపై నమాజ్ ఆపడంతో నిరసన..

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 8 ఏళ్ల క్రితం ఓ రాంగ్ కాల్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మహిళతో పరిచయం ఏర్పరుచుకున్నాడు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన అక్షయ్ కుమార్ అనే వ్యక్తి.. ఆ పరిచయం కాస్తా వారి మధ్య సన్నిహిత్యాన్ని పెంచింది.. కన్నింగ్‌ ఐడియాలతో ఉన్న అక్షయ్‌ కుమార్‌.. ఆమెతో పర్సనల్‌గా ఉన్న సమయంలో వీడియోలను రికార్డ్ చేశాడు.. ఇక, కొంత సమయం తర్వాత అతడి నిజస్వరూపాన్ని బయటపెట్టాడు.. బాధితురాలితో పర్సనల్‌గా తీసుకున్న వీడియోలను చూపించి బెదిరించసాగాడు.. దఫా దఫాలుగా డబ్బులు వసూలు చేశాడు.. ఇలా నాలుగు కోట్ల రూపాయల నగదు, 800 గ్రాముల బంగారు ఆభరణాలు కాజేసి జల్సాలు చేయసాగాడు.. అంతే కాదు, తన కోరిక తీర్చాలంటూ పదేపదే వేధింపులు గురిచేసేవాడు.. ఓ వైపు బ్లాక్‌మెయిల్‌తో కోట్లలో డబ్బులు.. మరోవైపు.. వేధింపులు ఆగకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులు ఆశ్రయించారు.. విశాఖ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ ఘటనపై కేసు నమోదు అయింది.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సెల్‌ఫోన్‌ సిగ్నల్ ఆధారంగా అక్షయ్ కుమార్ తిరుపతిలో ఉన్నట్లు గుర్తించారు.. తిరుపతిలో అరెస్టు చేసి విశాఖకు తరలించారు పోలీసులు.. నిందితుడు వద్ద నుండి 65 గ్రాముల బంగారం, సెల్ ఫోన్‌ స్వాధీనం చేసుకోవడంతో పాటు బ్యాంకులో ఉన్న సుమారు రెండు కోట్ల రూపాయల నగదు సీజ్ చేశారు. కొత్త వ్యక్తులతో.. తెలియనివారితో.. పరిచయాలు ఏర్పడినప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు..