Site icon NTV Telugu

Ananthapur Crime: కటకటాల వెనక్కి.. తండ్రిని చంపిన కొడుకు

Ananthapur Crime

Ananthapur Crime

Ananthapur Crime: క్షణికావేశం.. మనిషిని రాక్షస్తున్ని చేస్తుంది. ఇలాంటి ఆవేశమే అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి ఉసురు తీసింది. కన్న కొడుకు చేతిలోనే వ్యక్తి బలి కావాల్సిన దుస్థితి దాపురించింది. ఈ ఘటన అనంతపురం జిల్లా పామిడిలో జరిగింది. తండ్రిని చంపిన కొడుకు ఇప్పుడు కటకటాల వెనక్కి వెళ్లాడు. ఆయన పేరు సుధాకర్. అనంతపురం జిల్లా పామిడిలో బెస్తవీధిలో నివాసం ఉంటున్నారు. వృత్తిరీత్యా లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య మీనాక్షి, కుమారుడు ప్రకాశ్ ఉన్నారు. లారీ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న సుధాకర్‌.. ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం సేవించి వచ్చి ఇంట్లో గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో భార్య మీనాక్షితో రోజూ గొడవ అవుతోంది…

READ ALSO: OG : పవన్ కల్యాణ్‌ పాడిన సాంగ్ రిలీజ్..

ప్రతి రోజూ తండ్రి తీరును గమిస్తున్నాడు కొడుకు ప్రకాశ్. రోజూ తల్లిని వేధించడంపై తండ్రిని ప్రశ్నించే వాడు. ఐతే మైనర్ కావడంతో తండ్రి సుధాకర్ పెద్దగా పట్టించుకునేవాడు కాదు. మరోవైపు 3 రోజుల క్రితం కూడా సుధాకర్ ప్రవర్తన మరింత శ్రుతి మించింది. భార్య మీనాక్షిపై చేయి చేసుకున్నాడు. మద్యం తాగేసి నానా యాగీ చేశాడు. దీంతో తండ్రిని మందలించాడు కొడుకు. కానీ వినిపించుకోకపోవడం.. మరింత గొడవ చేయడంతో.. క్షణికావేశంలో రోకలిబండతో తండ్రిపై దాడి చేశాడు. ఈ దాడిలో సుధాకర్ తలకు తీవ్రంగా గాయమైంది. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కాసేపటికే మృతి చెందాడు…

ఇరుగు పొరుగు వారి వద్ద నుంచి సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుధాకర్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం తరలించారు. కుమారున్ని అదుపులోకి తీసుకున్నారు. మర్డర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు..కొడుకు చేతిలో భర్త చనిపోవడం… కొడుకు జువైనల్ హోమ్‌కు వెళ్లడంతో మీనాక్షి ఒంటరిగా మిగిలిపోయింది…

READ ALSO: Nizamabad Cybercrime Scam: లైఫ్ సెటిల్ అయిపోతుందని ఆశ పడతారు.. కానీ!

Exit mobile version