Site icon NTV Telugu

Arunachalam : అరుణాచలంలో అనుమానాస్పద మృతి.. నవీన్ ది హత్యా? ఆత్మహత్యా?

Arunachalam

Arunachalam

Arunachalam : అనకాపల్లి జిల్లాలో పరువు హత్య జరిగిందా? కులమతాలకు అతీతంగా నడిచిన ప్రేమ వ్యవహారం చివరకు హత్యకు దారి తీసిందా? తమతో పాటే యువకున్ని తీసుకెళ్లిన తల్లి, బిడ్డ అతన్ని ఏం చేశారు? ప్రేమించిన యువకుడు ఎలా చనిపోయాడు? ఆత్మహత్య చేసుకున్నాడా? హత్య చేశారా? అసలు అరుణాచలంలో ఏం జరిగింది? అనకాపల్లి జిల్లాలో పరువు హత్య ఓ గ్రామాన్ని విషాదంలో నింపింది. రాంబిల్లి మండలం వెంకటాపురానికి చెందిన యువకుడు నవీన్.. అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ప్రియురాలు, ఆమె తల్లితో కలిసి అరుణాచలం వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో ప్రియురాలి కుటుంబ సభ్యులే తమ పరువు కోసం హత్య చేసి ఉంటారని నవీన్.. కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా నవీన్ మృతిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి..

Anil Sunkara : భోళా శంకర్.. చిరంజీవిని బ్లేమ్ చేయడానికే అలా చేశారు..

వెంకటాపురం మాజీ సర్పంచ్ కూతురును నవీన్ ప్రేమించాడు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య కులచిచ్చు రేగింది. దీంతో ఇద్దరి ప్రేమను అంగీకరించలేదు. ఐతే ప్రియురాలి తల్లి చిన్నమ్ములు ఇద్దరినీ అరుణాచలంకు తీసుకు వెళ్లింది. అక్కడ ఓ లాడ్జిలో బంధించి.. అతనిపై తీవ్రంగా దాడి చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందుగానే చిన్నమ్ములు సుఫారీ.. ఇచ్చి తీసుకుని వెళ్లిన గ్యాంగ్‌తో నవీన్ గొంతు కోసి ఆ తరువాత మొదటి అంతస్తు నుంచి కిందకు తోసేసి అత్యంత దారుణంగా హతమార్చారని చెబుతున్నారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడని ఓ నాటకానికి తెర లేపారంటున్నారు. కానీ నవీన్ ఒంటిపై గాయాలు చూసిన పోలీసులకు బంధువులకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి..

నవీన్ బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నైలోని కే -10 పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చేతికి అందిన కొడుకును కోల్పోయిన ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. నిజంగా ప్రేమించుకుంటే ఆ విషయాన్ని తనకి చెప్పినట్లయితే తన కుమారుడిని ఆ ప్రేమకు దూరం పెట్టే వారమంటున్నారు తల్లితండ్రులు. ప్రేమిస్తే చంపేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాఫ్తు చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మృతికి కారణమైన వారిని కటినంగా శిక్షించాలని కోరుతున్నారు…

Vijay: బీజేపీ, డీఎంకేలను వదిలిపెట్టం, దళపతి విజయ్ వార్నింగ్..

Exit mobile version