Site icon NTV Telugu

Jani Master Case: జానీ మాస్టర్‌ కేసులో ఊహించని ట్విస్ట్‌..! ఆమె నాపై లైంగికదాడి చేసిందంటూ యువకుడి ఫిర్యాదు..

Jani Master

Jani Master

Jani Master Case: సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో ఊహించని ట్విస్ట్‌ వచ్చి చేరింది.. జానీ మాస్టర్‌ కేసులో బాధితురాలిగా ఉన్న యువతిపై ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడో యువకుడు.. జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన శ్రష్టి వర్మపై నెల్లూరు పోలీసులకు జానీ మాస్టర్‌ అల్లుడు షమీర్‌ ఫిర్యాదు చేయడం.. ఆమెపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది..

Read Also: Dasara Puja 2024: దసరా శుభ సమయం.. పూజా విధానం.. మంత్రం..

సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన శ్రష్టి వర్మ పై నెల్లూరు పోలీసులకు జానీ అల్లుడు షమీర్ ఫిర్యాదు చేశారు. మామ జానీతో కలిసి హైదరాబాద్.. చెన్నైలలో సినిమా షూటింగులకు వెళ్లినప్పుడు తనను శ్రష్టి వర్మ లైంగికంగా వేధించిందని ఆరోపించారు. 2021లో ఇది జరిగిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. లిఫ్టులు. షూటింగ్ లో విశ్రాంతి తీసుకునే వాహనం.. లాడ్జీ గదులలో తనపై లైంగిక దాడి చేసి నగ్న ఫొటోలు తీసిందన్నారు. అప్పుడు తాను మైనర్ అని.. ప్రస్తుతం తన మామపై ఫిర్యాదు చేయడంతో వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఫొటోలు అందరికీ పంపుతానని శ్రష్టి వర్మ తనను బెదిరించినట్లు వెల్లడించారు. తనను బెదిరింపులకు గురి చేస్తున్న శ్రష్టి వర్మ పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Read Also: AR Rahman- Kamala Harris: కమలా హారిస్‌ ఎన్నికల ప్రచార సభకు ఏఆర్‌ రెహమాన్‌ వీడియో

ఇక, షమీర్ ఫిర్యాదు పై నెల్లూరులోని సంతపేట పోలీసులు.. వివరాలు సేకరిస్తున్నారు. ఫిర్యాదులో లైంగిక వేధింపులకు గురైనట్లు చెబుతున్న ప్రాంతం తమిళనాడు.. తెలంగాణ రాష్ట్రాల పరిధిలో ఉండడంతో ఫిర్యాదును అక్కడి పోలీసులకు పంపాలని భావిస్తున్నారు. అంతేగాక దీనిపై న్యాయ నిపుణుల సలహా మేరకే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం జరిగిన ఘటనపై అప్పుడు ఫిర్యాదు చేయకుండా ఇప్పుడు చేయడంపై పోలీసులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

కాగా, లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్‌ అయిన కొరియోగ్రాఫర్​ షేక్‌ జానీ బాషా అలియాస్‌ జానీమాస్టర్‌ బెయిల్​ పిటిషన్‌పై రంగారెడ్డి కోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. బెయిల్​ పిటిషన్‌పై ఈ నెల 14వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పు వెల్లడించిన విషయం విదితమే.. ఇక, తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడని.. ఆ విషయాన్ని బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానంటూ భయపెట్టాడంటూ.. జానీ మాస్టర్‌పై సెప్టెంబర్​ 15వ తేదీన రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కొరియోగ్రాఫర్‌ ఫిర్యాదు చేసిన విషయం విదితమే.. ఇక, జానీ మాస్టర్‌పై జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు నార్సింగి పీఎస్‌కు బదిలీ చేయడం.. కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే..

Exit mobile version