Site icon NTV Telugu

Kerala: అంబులెన్స్ డ్రైవర్ దారుణం.. బాలిక కిడ్నాప్, సామూహిక అత్యాచారం..

Girl Raped

Girl Raped

Kerala: కేరళలో దారుణం జరిగింది. పతనంతిట్టలో ఆదివారం సాయంత్రం 10 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో 19 ఏళ్ల అంబులెన్స్ డ్రైవర్, 15 ఏళ్ల బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు ఎర్నాకుళంలోని వడయంపాడి నివాసిగా గుర్తించారు. కక్కనాడ్ ఇన్ఫో పార్క్‌లో ప్రధాన నిందితుడు సుధీర్ రమేశ్ అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బాలికను ఆమె ఇంటి సమీపం నుంచి కిడ్నాప్ చేశాడు. చెన్నంపుత్తూర్ కాలనీలోని ఒక పాడుబడిన ఇంటిలోకి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Read Also: Swati Maliwal: దోపిడీ కోసం కేజ్రీవాల్ తన ‘‘గుండా’’ని పంజాబ్ పంపాడు..

15 ఏళ్ల టీనేజర్ కూడా బాలికపై అత్యాచారం చేశాడు. పోలీసులకు సమాచారం అందడంతో బాలికను వైద్య పరీక్షల కోసం అదూర్ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల పరీక్ష అనంతరం అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం తెల్లవారుజామున నిందితుడు రమేష్‌ని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి ఫోటోల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version