Alluri District Blast: మైనింగ్ ప్రాంతంలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి

Alluri District Blast

Alluri District Blast

 

Alluri District Blast: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి మండలం పినకోట సమీపంలోని మైనింగ్ ప్రాంతంలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మొదట నలుగురు ప్రాణాలు విడిచినా.. ఆ తర్వాత మృతుల సంఖ్య ఆరుకు చేరినట్లు సమాచారం. మృతుల్లో ఓ ఉపాధ్యాయురాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతతో స్థానికంగా విషాదం నెలకొంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న గుత్తేదారుకు చెందిన వాహనాల వద్ద ఈ ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం నుంచి టిప్పర్‌లోకి డీజిల్ నింపుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.. పేలుడు ధాటికి బొలెరో వాహనం తునాతునకలైంది. మరోవైపు టిప్పర్‌ మంటల్లో పూర్తిగా దగ్ధమైంది.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పరిస్థితి తీవ్రంగా మారింది. మృతుల వివరాలు, ప్రమాదానికి దారితీసిన పూర్తి కారణాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.