NTV Telugu Site icon

Crime: ‘‘రా’’ ఏజెంట్‌గా నటిస్తూ, కెనడా మహిళపై అత్యాచారం..

Crime

Crime

Crime: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాకు చెందిన ఒక జిమ్ ట్రైన్ RAW (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్‌గా నటిస్తూ.. భారత సంతతికి చెందిన కెనడియన్ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేరంపై జిమ్ ట్రైనర్‌పై పోలీసులు అత్యాచారం, క్రిమినల్ బెదిరింపుల కింద కేసులు నమోదు చేశారు. ఈ లైంగిక దోపిడిలో నిందితడి స్నేహితుడు కూడా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

సికంద్రా పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ నీరజ్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు సాహిల్ శర్మ 2024 మార్చిలో ఆగ్రా హోటల్‌లో ఆమెను కలవడానికి ముందు, ఆమెతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ టిండర్‌లో స్నేహం చేశాడు. ఆమెను కలుసుకున్న సమయంలో ఆమె తాగే కూల్‌డ్రింక్‌లో మంత్తు మందు కలిపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమె స్పృహ తప్పిన తర్వాత, మద్యం తాగి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

Read Also: Mary Millben: ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించిన అమెరికన్ సింగర్ మేరీ మిల్‌బెన్..

మహిళ స్పృహలోకి వచ్చిన తర్వాత తాను ‘‘రా’’ ఏజెంట్ అని బెదిరించినట్లు మహిళ పేర్కొంది. వారి పెళ్లి గురించి కూడా నిందితుడు మాట్లాడినట్లు చెప్పింది. కెనడాకు తిరిగి వెళ్లిన తర్వాత కూడా బాధిత మహిళతో కాంటాక్ట్‌లోనే ఉన్నాడు. తాను రా కోసం పనిచేస్తున్నానని, తన తల్లిని కలవాలని కోరుతూ మరోసారి మహిళని ఇండియాకి వచ్చేలా చేశాడు. ఆమె వచ్చిన తర్వాత పలుమార్లు లైంగిక దోపిడికి పాల్పడ్డాడు. నిందితుడి స్నేహితుడు ఆరిఫ్ అలీ కూడా తనపై హోటల్ బాత్రూంలో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళ ఆరోపించింది.

తాను గర్భవతి అని తేలడంతో జిమ్ ట్రైనర్‌ని సంప్రదించేందుకు మహిళ ప్రయత్నించింది. అయితే, నిందితుడు ఆమె ప్రైవేట్ ఫోటోలను ఆన్‌లైన్‌లో షేర్ చేస్తానని బెదిరించాడని, తన వాట్సాప్ చాట్‌ డిలీట్ చేసేలా చేశాడిన ఆరోపించింది. సాహిల్ స్నేహితుడు ఆరిఫ్ తన అశ్లీల చిత్రాలతో తనను బ్లాక్ మెయిల్ చేసినట్లు మహిళ ఆరోపించింది.

Show comments