Shraddha Case: కేసులో షాకింగ్ ట్విస్టులు.. ఫ్రిజ్‌లో శవం పెట్టి, మరో యువతితో రొమాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aftad Dated Another Girl After Killing Shraddha Vikas: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వికాస్ హత్య కేసులో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రద్ధాని చంపి, ఆమె శవాన్ని ఫ్రిజ్‌లో పెట్టి.. అఫ్తాబ్ మరో యువతితో డేటింగ్ చేసినట్లు తేలింది. ఆమెను పలుమార్లు ఇంటికి కూడా పిలిపించుకున్నాడట. స్వయంగా అఫ్తాబ్ ఈ విషయాన్ని పోలీసుల విచారణలో తెలిపాడు. అంతేకాదు.. ఆనవాళ్లు లేకుండా ఒక శవాన్ని ఎలా మాయం చేయాలన్న విషయాలను ఇంటర్నెట్‌లో సమాచారాన్ని శోధించాడని, డెక్స్‌టర్ అనే వెబ్‌సిరీస్‌ని స్ఫూర్తిగా తీసుకున్నట్టు కూడా అతడు ఒప్పుకున్నాడు. అందుకే.. ఇంట్లోనే శవం ఉన్నప్పటికీ మిత్రులకు గానీ, డెలీవరీ బాయ్స్‌కి గానీ అనుమానం రాలేదు.
కాగా.. ఇంట్లో వాళ్లు తమ పెళ్లికి ఒప్పుకోలేదని అఫ్తాబ్, శ్రద్ధా ఢిల్లీకి వెళ్లారు. లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. పెళ్లి చేసుకోమని శ్రద్ధా ఒత్తిడి చేయడంతో.. తరచూ వీరి మధ్య ఘర్షణ జరుగుతుండేది. ఈ క్రమంలోనే మే 18వ తేదీ కూడా వీరి మధ్య గొడవ జరగ్గా.. అఫ్తాబ్ ఆమె గొంతు కోసి చంపేశాడు. అనంతరం.. తాను చూసే క్రైమ్ షోల్లోలాగా ఆమె శవాన్ని ముక్కలుగా నరికి, ఫ్రిజ్‌లో భద్రపరిచాడు. శరీరాన్ని ముక్కలు చేయడం కోసం ‘హ్యూమన్ అనాటమీ’ని చదివాడు. ఇంట్లో వాసన వాసన రాకుండా ఉండేందుకు.. రోజూ అగర్‌బత్తీని వెలిగించేవాడు. త్వరగా దెబ్బతినే శరీరా భాగాలను, రాత్రి వేళల్లో పారేసేవాడు. అప్పుడప్పుడు శ్రద్ధా ముఖాన్ని ఫ్రిజ్‌లో నుంచి చూసేవాడు. రక్తాన్ని ఎలా శుభ్రం చేయాలి, మానవశరీర నిర్మాణం ఎలా ఉంటుందనే అంశాల్ని సైతం అతని ఇంటర్నెట్‌లో చూసినట్లు తేలింది. శ్రద్ధా శవం ఇంట్లోని ఫ్రిజ్‌లోనే ఉండగానే.. మరో యువతితో డేటింగ్ నడిపాడు. శ్రద్ధాని చంపాక ఓ డేటింగ్ యాప్‌ని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసి, దాని ద్వారా ఒక యువతికి ఎరవేశాడు. శ్రద్ధా శవం ఇంట్లో ఉండగానే.. ఆ యువతి జూన్, జులైలో కొన్నిసార్లు అతని ఇంటికి వెళ్లి వచ్చింది.
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
మరోవైపు.. శ్రద్ధా బ్రతికే ఉందని అందరినీ నమ్మించేందుకు అఫ్తాబ్ ఆమె సోషల్ మీడియా ఖాతాల్లోకి లాగిన్ అయి, అప్పుడప్పుడు పోస్టులు పెట్టేవాడు. ఆమె క్రెడిట్ కార్డు బిల్లుల్ని కూడా చెల్లించేవాడు. కానీ.. రోజులు గడిచేకొద్దీ ఇవన్నీ మేనేజ్ చేయడం అతనికి కష్టమయ్యింది. రానురాను ఆమె సోషల్ మీడియా ఖాతాల్ని పక్కన పెట్టేశాడు. ఫోన్ కూడా స్విచాఫ్‌లో పెట్టేవాడు. దీంతో ఆమె స్నేహితులకు అనుమానం వచ్చి, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అలా ఈ హత్య కేసు బయటపడింది.
తాజావార్తలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!