Site icon NTV Telugu

Shraddha Case: కేసులో షాకింగ్ ట్విస్టులు.. ఫ్రిజ్‌లో శవం పెట్టి, మరో యువతితో రొమాన్స్

Aftab Dated Another Girl

Aftab Dated Another Girl

Aftad Dated Another Girl After Killing Shraddha Vikas: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వికాస్‌ హత్య కేసులో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రద్ధాని చంపి, ఆమె శవాన్ని ఫ్రిజ్‌లో పెట్టి.. అఫ్తాబ్ మరో యువతితో డేటింగ్ చేసినట్లు తేలింది. ఆమెను పలుమార్లు ఇంటికి కూడా పిలిపించుకున్నాడట. స్వయంగా అఫ్తాబ్ ఈ విషయాన్ని పోలీసుల విచారణలో తెలిపాడు. అంతేకాదు.. ఆనవాళ్లు లేకుండా ఒక శవాన్ని ఎలా మాయం చేయాలన్న విషయాలను ఇంటర్నెట్‌లో సమాచారాన్ని శోధించాడని, డెక్స్‌టర్ అనే వెబ్‌సిరీస్‌ని స్ఫూర్తిగా తీసుకున్నట్టు కూడా అతడు ఒప్పుకున్నాడు. అందుకే.. ఇంట్లోనే శవం ఉన్నప్పటికీ మిత్రులకు గానీ, డెలీవరీ బాయ్స్‌కి గానీ అనుమానం రాలేదు.

కాగా.. ఇంట్లో వాళ్లు తమ పెళ్లికి ఒప్పుకోలేదని అఫ్తాబ్, శ్రద్ధా ఢిల్లీకి వెళ్లారు. లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. పెళ్లి చేసుకోమని శ్రద్ధా ఒత్తిడి చేయడంతో.. తరచూ వీరి మధ్య ఘర్షణ జరుగుతుండేది. ఈ క్రమంలోనే మే 18వ తేదీ కూడా వీరి మధ్య గొడవ జరగ్గా.. అఫ్తాబ్ ఆమె గొంతు కోసి చంపేశాడు. అనంతరం.. తాను చూసే క్రైమ్ షోల్లోలాగా ఆమె శవాన్ని ముక్కలుగా నరికి, ఫ్రిజ్‌లో భద్రపరిచాడు. శరీరాన్ని ముక్కలు చేయడం కోసం ‘హ్యూమన్‌ అనాటమీ’ని చదివాడు. ఇంట్లో వాసన వాసన రాకుండా ఉండేందుకు.. రోజూ అగర్‌బత్తీని వెలిగించేవాడు. త్వరగా దెబ్బతినే శరీరా భాగాలను, రాత్రి వేళల్లో పారేసేవాడు. అప్పుడప్పుడు శ్రద్ధా ముఖాన్ని ఫ్రిజ్‌లో నుంచి చూసేవాడు. రక్తాన్ని ఎలా శుభ్రం చేయాలి, మానవశరీర నిర్మాణం ఎలా ఉంటుందనే అంశాల్ని సైతం అతని ఇంటర్నెట్‌లో చూసినట్లు తేలింది. శ్రద్ధా శవం ఇంట్లోని ఫ్రిజ్‌లోనే ఉండగానే.. మరో యువతితో డేటింగ్ నడిపాడు. శ్రద్ధాని చంపాక ఓ డేటింగ్ యాప్‌ని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసి, దాని ద్వారా ఒక యువతికి ఎరవేశాడు. శ్రద్ధా శవం ఇంట్లో ఉండగానే.. ఆ యువతి జూన్‌, జులైలో కొన్నిసార్లు అతని ఇంటికి వెళ్లి వచ్చింది.

మరోవైపు.. శ్రద్ధా బ్రతికే ఉందని అందరినీ నమ్మించేందుకు అఫ్తాబ్ ఆమె సోషల్‌ మీడియా ఖాతాల్లోకి లాగిన్ అయి, అప్పుడప్పుడు పోస్టులు పెట్టేవాడు. ఆమె క్రెడిట్ కార్డు బిల్లుల్ని కూడా చెల్లించేవాడు. కానీ.. రోజులు గడిచేకొద్దీ ఇవన్నీ మేనేజ్ చేయడం అతనికి కష్టమయ్యింది. రానురాను ఆమె సోషల్ మీడియా ఖాతాల్ని పక్కన పెట్టేశాడు. ఫోన్ కూడా స్విచాఫ్‌లో పెట్టేవాడు. దీంతో ఆమె స్నేహితులకు అనుమానం వచ్చి, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అలా ఈ హత్య కేసు బయటపడింది.

Exit mobile version