Site icon NTV Telugu

Crime: అక్రమ సంబంధం అనుమానంతో భార్య, కుమార్తెలపై యాసిడ్ దాడి..

Acid Attack

Acid Attack

Crime: తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించిన భర్త యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన యూపీలోని షాజహాన్‌పూర్ జిల్లాలో జరిగింది. తిక్రి గ్రామంలో ఈ దాడి జరిగింది. భర్త రామ్ గోపాల్ శుక్రవారం రాత్రి తన భార్య 39 ఏళ్ల రాంగుని, కుమార్తెలైన 16 ఏళ్ల నేహా, 23 ఏళ్ల రచితపై యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనలో వీరంతా తీవ్రంగా గాయపడ్డారు.

Read Also: Assam: భార్య తల నరికి, తలతో పోలీస్ స్టేషన్‌కు..

బాధితురాలు తన ఇద్దరు కుమార్తెలతో, ఒక కొడుకుతో తిక్రి గ్రామంలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఆమె భర్త రామ్ గోపాల్ షహాబాద్ హర్దోయ్‌లో నివసిస్తున్నాడని ఏఎస్పీ దేవేంద్ర కుమార్ ఆదివారం తెలిపారు. శుక్రవారం రాత్రి రాంగుని, ఆమె కుమార్తెలు నిద్రిస్తున్న సమయంలో, రామ్ గోపాల్ గోడ దూకి ఇంట్లోకి చొరబడి, వారిపై యాసిడ్ దాడి చేసినట్లు వెల్లడించారు. సంఘటన జరిగిన సమయంలో రాంగుని కుమారుడు అషు స్నేహితుడితో కలిసి ఉండటంతో అతడు దాడి నుంచి బయటపడ్డాడు.

ఈ సంఘటనపై కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రి మద్యానికి బానిసయ్యాడని, దీని కారణంగానే షహాబాద్ ప్రాంతంలోని తన వ్యవసాయ భూమిని విక్రయించినట్లు అతను పోలీసులకు వెల్లడించాడు. దీని తర్వాత రాంగుని తన పిల్లలతో కలిసి తిక్రి గ్రామానికి వెళ్లింది. అయితే, తరుచుగా రామ్ గోపాల్ భార్య రాంగుని అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానిస్తుండే వాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు, అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Exit mobile version