ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ హోటల్ ప్రీత్ ప్యాలెస్‌లో 28 ఏళ్ల యువతి రక్తంతో తడిసిపోయి కనిపించింది. మహ్మద్ ఆలం అనే వ్యక్తి ఐడీని ఉపయోగించి బుక్ చేసిన హోటల్ గదిలో మహిళ శవమై కనిపించింది. ప్రస్తుతం ఈ వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ గొంతు కోసి దారుణంగా హతమార్చారు. బట్టలు చిందరవందరగా ఉన్నాయి. మృతదేహం దగ్గర విడివిడిగా బురఖా పడి ఉండడంతో ఆ మహిళ ముస్లిం అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ కేసులో మహిళ మృతదేహాన్ని పోర్ట్‌మార్టం కోసం పంపినట్లు బరేలీ పోలీసులు తెలిపారు. మహిళ హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
READ MORE: Minister Rama Naidu: వెలుగొండ ప్రాజెక్టు పటిష్టతపై మంత్రి నిమ్మల సంచలన కామెంట్లు
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. అసలు రూమ్ బుక్ చేసిన మహ్మద్ ఆలం అనే వ్యక్తి ఎవరు? చనిపోయిన మహిళకు, అతడికి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఎవరు ఆమెను అంత కిరాతకంగా హత్య చేశారు? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
उत्तर प्रदेश : बरेली के होटल में 28 वर्षीय लड़की की लाश मिली। गला कटा हुआ था। कपड़े भी अस्त-व्यस्त थे। बुर्का अलग पड़ा मिला है। इससे आशंका है कि लड़की मुस्लिम थी। होटल का ये कमरा मोहम्मद आलम की ID पर बुक हुआ था, जो अब लापता है। pic.twitter.com/Ed7brwfYU9
— Sachin Gupta (@SachinGuptaUP) August 20, 2024
READ MORE:Andhra Pradesh: భారీ విస్తరణకు హెచ్‌సీఎల్ సన్నాహాలు.. రాష్ట్రంలో మరో 15 వేల ఉద్యోగాలు
#Barelly #बरेली: होटल के कमरे में मिला #महिला का खून से लथपथ #शव#गला_रेतकर जताई जा रही हत्या की आशंका, शहर कोतवाली क्षेत्र के रोडवेज पर #होटल_प्रीत का मामला@bareillypolice @dmbareilly @CMOfficeUP @Uppolice #Muder pic.twitter.com/f6PtNuenku
— Goldy Srivastav (@GoldySrivastav) August 20, 2024
