NTV Telugu Site icon

Shocking incident: సెల్ఫీ కోసం తీసుకెళ్లి.. భర్తను చెట్టుకు కట్టేసి నిప్పుపెట్టిన భార్య

Shocking Incident

Shocking Incident

Shocking incident: వివాహేతర సంబంధాలకు కారణం మగ లేదా ఆడ లేదా భర్త, భార్య లేదా స్నేహితురాలు ప్రియుడు అనే తేడా లేదు. వైవాహిక జీవితంలో ఏదైనా అసంతృప్తి ఉంటే.. వెంటనే పక్క దారి మళ్లేందుకు అవకాశాలు ఎక్కువ. వాటిలో ఒకటి వివాహేతర సంబంధాలు. దీంతో అక్రమ సంబంధాలు పెరగడమే కాకుండా పలు సందర్భాల్లో హత్యలకు దారితీస్తున్నాయి. వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న దారుణాలకు అంతులేకుండా పోతోంది. తప్పు చేయాలనే ఆలోచన లేకుండా చాలా సింపుల్ గా తమ భాగస్వాములను చంపేస్తూ హింసకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలో భార్య చేసిన పని చాలా అమానుషం దారుణమైనది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య భర్తను చెట్టుకు కట్టేసి కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ షాకింగ్ ఘటన బీహార్‌లో వెలుగు చూసింది. సెల్ఫీ దిగేందుకు భర్తను చెట్టుపైకి తీసుకెళ్లింది. ఆ తర్వాత అతడిని చెట్టుకు కట్టేసింది. అతడిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

Read also: Health Tips: రోజంతా యాక్టివ్ గా ఉండాలంటే ఉదయం వీటిని తప్పక తీసుకోవాలి..

ముజఫర్‌పూర్ జిల్లా వాసుదేవ్‌పూర్ సరాయ్ పంచాయతీ గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువతికి గ్రామంలోని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు భర్త అడ్డుగా నిలిచాడు. భర్తను వదిలి వెళ్లితే ఇంట్లో వాళ్లు కారణాలు అడుగుతారు. మరి ప్రియుడితో ఎలా గడపాలి అనుకుందో ఏమో గానీ భర్తనే చంపేందుకు ప్లాన్ వేసింది. భర్తను చంపేస్తే ప్రియుడుతో వివాహేతర సంబంధం పెట్టుకుని హాయిగా గడపచ్చుకుంది. ఇంట్లో భర్తను చంపేస్తే అందరికి అనుమానం వస్తుందని బయటకు తీసుకు వెళ్లి చంపేందుకు ప్లాన్ వేసింది. ఆరోజంగా భర్తతో అన్యోన్యంగా ఉంది. తన భర్తను సెల్ఫీ తీసుకుందామని బయటకు వెళ్దామా అంటూ కోరింది. దీంతో భర్త సరే అన్నాడు. ఇద్దరు బాగా రెడీ అయ్యి బయటకు వెళ్ళారు. అప్పటికే రాత్రి అయ్యింది. ఈ రాత్రిలో సెల్ఫీ తీసుకుంటే లైటింగ్ కి ఫోటోలు బాగా వస్తాయంటూ నమ్మించింది. ఇద్దరు బయటకు వెళ్లారు. ఓ చెట్టును చూపించి అక్కడ నిలబడి సెల్ఫీ తీసుకుంటే బాగుంటుందని భర్తను నమ్మించింది. అయితే అది నమ్మిన భర్త చెట్టు దగ్గర నిలబడి ఉండగా.. వెనక నుంచి అతని చేతులు కట్టేసింది. సరదాగా అనుకున్న భర్త అరవకుండా నిలబడి నవ్వుతూ ఉన్నాడు.

కాగా తను అరవకుండా నోటికి గడ్డను బిగించింది. దీంతో భయాందోళన చెందిన భర్త కేకలు వేసేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో అతనిపై పథకం ప్రకారం అక్కడికి తన ప్రియుడు కూడా వచ్చాడు. కిరోషిన్ తీసుకుని భర్తపై పోసి నిప్పు పెట్టారు. మంటలు ఉవ్వెత్తున చెలరేగడంతో భయ భ్రాంతులైన గ్రామస్తులు పరుగులు తీసుకుంటూ ఘటన వద్దకు చేరుకున్నారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అయినా అప్పటికే ఆ వ్వక్తి సగం కాలిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. అయితే భార్య ఏమీ తెలియనట్లు అక్కడే ఏడుస్తూ నిలబడి ఉంది. స్థానికులు సాహెబ్‌గంజ్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి భార్యను ప్రశ్నించగా మొదట తనకు ఏమీ తెలియదంటూ అమాయకంగా నటించింది. దీంతో ఆమెపై అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. వివాహేతర సంబంధం కారణంగానే ఆమె ఇలాంటి దారుణానికి ఒడిగట్టిందని చెప్పడంతో భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tamannaah Bhatia: అవును, ఆ సంబంధం ఉంది.. రూమర్స్‌పై తమన్నా క్లారిటీ

Show comments