మహిళకు తెలియకుండా తన చిత్రాలను తీసి ఓ టీనేజ్ యువకుడు జైలుపాలైన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇంటి యజమాని కొడుకే బాత్‌రూంలో ఉన్పప్పుడు తన ఫోటోలను రహస్యంగా తీశాడని ఆరోపిస్తూ ఓ మహిళా బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
ఫిల్మ్ నగర్‌కు చెందిన 35 ఏళ్ల మహిళ తెలిపిన వివరాల ప్రకారం, అదే బహుళ అంతస్తుల భవనంలో మొదటి అంతస్తులో ఉంటున్న యువకుడు బాత్రూంలో ఉన్నప్పుడు తన చిత్రాలను తీయడం చూశానని తెలిపింది. దీంతో ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి మొబైల్ ఫోన్‌లోని కంటెంట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. దీనిపై పూర్తి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
