NTV Telugu Site icon

Boyfriend Suicide: ప్రియురాలు మాట్లాడట్లేదని.. ఉరేసుకున్న టెక్కీ

Techie Hangs Himself

Techie Hangs Himself

A Techie Hangs Himself Because Girlfriend Blocked His Number: హైదరాబాద్‌లో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. తాను ప్రేమించిన అమ్మాయితో తనతో మాట్లాడటం లేదని మనోవేదనకు గురైన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రియురాలు తనని దూరం పెట్టిందని, తన ఫోన్ నెంబర్‌ని బ్లాక్‌లో పెట్టిందంటూ సూసైడ్ నోట్ రాసి, ఉరి వేసుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. సదాశివపేట ఆరూరు గ్రామానికి చెందిన అఖిల్ (28), గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. చందానగర్‌లోని ఓ లాడ్జ్‌లో నివాసం ఉంటున్న ఈ టెక్కీ.. ఓ యువతిని ప్రేమించాడు. మొదట్లో వీరి ప్రేమకథ ‘మూడు పువ్వులు ఆరు కాయలు’ అన్నట్టుగా బాగానే సాగింది. ఇద్దరు కలిసి షికార్లకు వెళ్లడం, ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఇద్దరు కలిసి సరదాగా గడపడం లాంటివి చేశారు.

Lawrence Bishnoi: సల్మాన్ ఖాన్‌ను చంపడమే నా జీవిత లక్ష్యం.. జైలు నుంచే బిష్ణోయ్ బెదిరింపు

అలాంటి ఈ ప్రేమికుల మధ్య ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ.. ఆ యువతి అఖిల్‌ని దూరం పెట్టడం మొదలుపెట్టింది. తొలుత కలవడాన్ని నిరాకరించింది. తనని డిస్ట్రర్బ్ చేయొద్దని, ఇకపై తనతో మాట్లాడొద్దని చెప్పింది. ఆపై అతని ఫోన్ నంబర్ బ్లాక్‌లో కూడా పెట్టేసింది. అయితే.. అఖిల్ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ప్రియురాలిని విడిచి ఉండలేకపోయాడు. ఆమెకు తిరిగి దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు. కానీ.. ఫలితం లేకుండా పోయింది. దీంతో.. మనస్తాపానికి గురైన అఖిల్, ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. తాను ఉంటున్న లాడ్జ్‌లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను ప్రేమించిన అమ్మాయి తనతో మాట్లాడటం లేదని, ఫోన్ నంబర్‌ను బ్లాక్‌లో పెట్టిందని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

World’s Shortest Bodybuilder: ప్రపంచంలోనే అత్యంత పొట్టి బాడీబిల్డర్‌.. ఓ ఇంటివాడయ్యాడు..

Show comments