Site icon NTV Telugu

Delhi University: ఢిల్లీ యూనివర్శిటీ సౌత్ క్యాంపస్‌లో ఓ విద్యార్థి హత్య.. కారణమదేనా..!

Delhi Murder

Delhi Murder

Delhi University: ఢిల్లీ యూనివర్శిటీ సౌత్ క్యాంపస్‌లో హత్య కేసు వెలుగు చూసింది. సౌత్ క్యాంపస్‌లోని ఆర్యభట్ట కళాశాలలో విద్యార్థులు పరస్పరం ఘర్షణ పడ్డారు. ఇంతలో ఒక విద్యార్థిపై కత్తితో దాడి జరిగింది. ఈ దాడిలో విద్యార్థి మృతి చెందాడు. కత్తిపోట్లకు గురైన విద్యార్థి నిఖిల్ చౌహాన్(19) గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు ప్రియురాలే కారణమని తెలుస్తోంది. 7 రోజుల క్రితం నిఖిల్ ప్రియురాలితో ఓ విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత వారి మధ్య వాగ్వాదం జరగగా.. ఈరోజు మధ్యాహ్నం కత్తితో పొడిచి చంపారు.

Read Also: Rakesh Master: రాకేష్ మాస్టర్ అసలు పేరు ఏంటో తెలుసా..?

వెంటనే అక్కడున్న విద్యార్థులు నిఖిల్ ను చారిక పాలిక ఆసుపత్రిలో చేర్చారు. అయితే అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు నిఖిల్ చౌహాన్ పశ్చిమ విహార్ కు చెందిన వాసి. మరోవైపు నైరుతి ఢిల్లీలోని పాష్ జిల్లాలో ఈరోజు(ఆదివారం) ఒకే రోజు 3 హత్యలు జరిగాయి. ఉదయం ఇద్దరు అక్కాచెల్లెళ్లను కాల్చి చంపేశారు. ఆ తర్వాత కాలేజీ గేటు వద్ద విద్యార్థిని కత్తితో పొడిచి హత్య చేశారు. అయితే ఇద్దరు అక్కాచెల్లెళ్ల హత్యపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కూడా స్పందించారు.

Read Also: Rakesh Master: టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌ ఫొటోలు

నైరుతి ఢిల్లీలోని ఆర్కే పురంలో ఆదివారం తెల్లవారుజామున తమ సోదరుడితో ఆర్థిక వివాదాల కారణంగా ఇద్దరు అక్కచెల్లెలను కాల్చేశాడు. ఈ కాల్పుల ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అక్కడున్న స్థానికులు మర్డర్ వీడియోను రికార్డ్ చేశారు. ఈ ఘటన స్థానికంగా భయాభ్రాంతులకు గురిచేసింది.

Exit mobile version