Site icon NTV Telugu

Crime News: అర్ధరాత్రి నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్య..

Crime News

Crime News

Crime News: జనగామ జిల్లా కేంద్రంలోని హనుమకొండ రోడ్డు ఇండస్ట్రియల్ ఏరియా గురుద్వార్ ఎదురుగా ప్రధాన రహదారిపై ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది. అంబేద్కర్ నగర్‌కు చెందిన పగడాల సందీప్ అనే వ్యక్తి ఫకీర్ సురేష్‌ను కత్తితో మెడ కోసి హత్య చేశాడు. ఈ హత్య జరగడానికి ముందు సందీప్, సురేష్, మరో వ్యక్తి ముగ్గురు కలిసి ఘటనాస్థలికి పది మీటర్ల దూరంలో మద్యం సేవించారు. కుటుంబ తగాదాల నేపథ్యంలో సందీప్ సురేష్‌ను హత్య చేసినట్లు తెలుస్తోంది.

Software Engineer Incident: నార్సింగిలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనుమానాస్పద మృతి

మద్యం సేవించిన ముగ్గురిలో ఒకరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి హత్యకు సంబంధించిన సమాచారం అందించారు. వెంటనే సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. హత్య చేసిన సందీప్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version