NTV Telugu Site icon

Atrocious: ములుగు లో దారుణం.. ప్రేమ జంట ఆత్మహత్య..

Untitled 7

Untitled 7

Mulugu: ప్రేమంటే పెద్దలను ఎదిరించి ఒక్కటి కావడం కాదు. పెద్దవాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకోవడం.. పెద్దలు ఒప్పుకునే వరకు ఓపిక పట్టడం. అన్నింటికీ మించి కలిసి బతకడం. అంతేగాని ప్రేమంటే కలిసి చనిపోవడం కాదు. కానీ ప్రస్తుతం చాలామంది యువత ఏడాది ప్రేమనే వదులుకోలేక ప్రాణాలను తీసుకుంటారు..కానీ దాదాపు పాతికేళ్ళు కింద పెడితే చీమలు కుడతాయి.. పైన పెడితే గ్రద్దలు ముడతాయని గుండెల మీద పెట్టుకుని పెంచిన తల్లిదండ్రుల గురించి ఆలోచించడం మర్చిపోతున్నారు. ఇలా పెద్దలు ప్రేమ పెళ్ళికి ఒప్పుకోవడం లేదని ప్రేమ జంటలు గతంలో ప్రాణాలను కోల్పోయిన ఘటనలు కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. వివారాలోకి వెళ్తే.. ములుగు జిల్లా లోని మంగపేట మండలం లోని కమలాపూర్​ గ్రామానికి చెందిన మాదరి శిరీష(22) అనే యువతి.. ఎటూరునాగారం పట్టణానికి చెందిన బెజ్జంకి రాజేశ్​ (24) అనే యువకుడు ఏడాది నుండి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు.

Read also:Rahul Gandhi: రేపు రాష్ట్రానికి రాహుల్ గాంధీ.. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు

అయితే ఇంట్లో వాళ్ల ప్రేమ గురించి చెప్తే పెద్దలు ఒప్పుకుంటారో లేదో అనే భయం వాళ్ళ ప్రేమ విషయం ఇంట్లో చెప్పకుండా వాళ్లను ఆపింది. అయితే యువతి తండ్రి యువతికి పెళ్లి చెయ్యాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సంబంధాలు చూడడం ప్రారంభించారు. అయితే తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని 3 సంవత్సరాలు సమయం కావాలని యువతి తండ్రిని అడిగింది. అందుకు తండ్రి 6 నెలలు సమయం మాత్రం ఇస్తాను అని చెప్పారు. దీనితో ఆమె తాను ఓ అబ్భాయిని ప్రేమిస్తున్నట్లు తండ్రికి చెప్పింది. అయితే ఆ విషయం పట్టించుకోని తండ్రి ఓ సంబంధం తీసుకు వచ్చారు. ఈ క్రమంలో వాళ్ల ప్రేమను పెద్దలు ఒప్పుకోరని.. కలిసి బతకలేకపోయిన కలిసి చనిపోదాం అనుకున్నారు ఆ ప్రేమ జంట. అనుకున్నట్టుగానే మంగళవారం రాత్రి మంగపేట మండలం లోని వల్లూరు అటవీ ప్రాంతం లోని గుట్టపైకి వెళ్లారు.

Read also:Rahul Gandhi: రేపు రాష్ట్రానికి రాహుల్ గాంధీ.. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు

అనంతరం వాళ్ళు వెంట తెచ్చుకున్న పురుగులు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అనంతరం కుటుంబసభ్యులకు ఫోన్ చేసి వాళ్ళు చనిపోతున్నట్లు తెలిపారు. వాట్సాప్ లో వాళ్ళు ఉన్న లొకేషన్ షేర్ చేశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటీన అంబులెన్స్​ తో సహా ఘటన స్థలానికి చేరుకొని ఇద్దరిని ఏటూరు నాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఇంతలో వారి పరిస్థితి విషమించడంతో వరంగల్ లోని ఎంజీఎంకు తరలించారు. అయితే చికిత్స పొందుతున్న ఇద్దరిలో యువకుడు బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కాగా ఆస్పత్రిలో యువతి ప్రాణాలతో పోరాటం చేస్తుంది. ఈ సంఘటనతో ఇరు కుటుంబాలలో తీవ్ర విషాద ఛాయలు కమ్ముకున్నాయి.