NTV Telugu Site icon

Cyber Crime: ఫ్రై వైఫై వాడాడు.. రూ. 50 వేలు పోగొట్టుకున్నాడు

Free Wifi Cyber Crime

Free Wifi Cyber Crime

A Hyderabadi Boy Lost 50 Thousand For Using Free Wifi: ఫ్రీగా వస్తుందంటే.. ఫినాయిల్ తాగడానికైనా సిద్ధమైపోతారు కొందరు. అలాంటిది.. ఉచితంగా వైఫై లభిస్తే ఊరికే ఉంటారా? తమ మొబైల్‌లో ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఉన్నా సరే.. కొంచెం డేటా కలిసొస్తుంది కదా అని, ఫ్రీ వైఫైని వాడుకుంటారు. అలా వాడిన పాపానికి ఒక యువకుడు ఏకంగా రూ. 50 వేలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆ యువకుడి పేరు కుమార్. చదువు పూర్తి చేసిన అతను, గ్రూప్స్ కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చాడు. కోచింగ్ కోసం ఒక ఇన్‌స్టిట్యూట్‌లో చేరేందుకు, కుటుంబసభ్యులు అతనికి ఆన్‌లైన్‌లో డబ్బు పంపించారు.

Army Officer Suicide: ఆర్మీ అధికారి ఆత్మహత్య.. భార్యను హత్య చేసి..

కట్ చేస్తే.. నగర అందాల్ని వీక్షిద్దామని, కాసేపు సేద తీరుదామని కుమార్ బయటకు వెళ్లాడు. ఈ క్రమంలోనే అతడు ఒక షాపింగ్ మాల్ వద్దకు వెళ్లాడు. అక్కడికి చేరుకోగానే.. ఫ్రీ వైఫై సిగ్నల్ కనిపించింది. ఇంకేముంది.. తన మొబైల్ నెట్‌వర్క్ ఆఫ్ చేసి, ఫ్రీ వైఫైని వాడుకోవడం మొదలుపెట్టాడు. మొదట్లో అంతా బాగానే ఉంది కానీ, కాసేపయ్యాక అతని ఫ్యూజులు ఎగిరిపోయే మెసేజ్‌లు రావడం స్టార్ట్ అయ్యింది. ఇలా కొంచెం కొంచెంగా అతని బ్యాంక్ అకౌంట్ నుంచి ఏకంగా రూ. 50 వేలు పోయాయి. ఇది చూసి ఖంగుతిన్న కుమార్.. వెంటనే షాపింగ్ మాల్ వాళ్లను నిలదీశాడు. ప్రీ వైఫై ఆశ చూపించి, తన బ్యాంక్‌లో నుంచి డబ్బులు కొట్టేస్తారా? అంటూ వాగ్వాదానికి దిగారు. అయితే.. రివర్స్‌లో వాళ్లు కుమార్‌కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. అసలు తమ మాల్‌కి ఫ్రీ వైఫై యాక్సెస్ లేనే లేదని తెలిపారు. దీంతో ఏం చేయాలో తెలీక.. కుమార్ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించాడు.

Orissa High Court: అలా చేయడం అత్యాచారం కిందకు రాదు.. ఒరిస్సా హైకోర్టు సంచలన తీర్పు

కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే.. పబ్లిక్ ప్రదేశాల్లో అందుబాటులో ఉండే వైఫైని ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించొద్దని సూచిస్తున్నారు. ఒకవేళ అలా వినియోగిస్తే.. సోషల్ మీడియా ఖాతాలు ఓపెన్ చేసేందుకు, బ్యాంక్ లావాదేవీల కోసం నమోదు చేసే యూజర్ ఐడీ & పాస్‌వర్డ్‌లను మాల్‌వేర్ ద్వారా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో ఉచిత వైఫై వాడాల్సి వస్తే.. అది అధికారమైందా? కాదా? అనేది నిర్ధారించుకోవాలని చెప్తున్నారు.