వారిద్దరు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందామనుకున్నారు.. ఆరేళ్ల ప్రేమ వివాహంగా మారుతోందని ఆ అమ్మాయి మోహంలో సిగ్గులు మొగ్గలు వేసింది. ఇరు కుటుంబాలు పెళ్ళికి ఒప్పుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు. అంగరంగ వైభవంగా ఇద్దరి నిశ్చితార్థం జరిగింది. కొద్దిరోజుల్లో పెళ్లి అని ఆనందపడేలోపు యువకుడు షాక్ ఇచ్చాడు. స్నేహితుడి ప్రేయసితో పారిపోవడంతో.. వధువు సహా ఇరు కుటుంబ సభ్యులు షాకయ్యారు. రాజస్తాన్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.
వివరాలలోకి వెళితే.. రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌కు చెందిన బాదల్ నాయక్ అదే గ్రామానికి చెందిన ఒక యువతి ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవలే వీరి ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించి ఈ నెల 27 న నిశ్చితార్థం జరిపి, వచ్చే నెల 14 న పెళ్లి నిశ్చయించారు. అంతా సవ్యంగా జరుగుతుందన్న సమయంలో రెండు రోజుల నుంచి యువకుడు కనిపించడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతుండగానే… మరో యువతి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. ఈ రెండు కేసులను విచారిస్తుండగా మిస్ అయిన ఇద్దరు శనివారం పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమయ్యారు. మిస్ అయిన యువతి, యువకుడి స్నేహితుడి ప్రేయసి కావడం గమనార్హం. తామిద్దరం ప్రేమించుకుంటాన్నామని చెప్పడంతో సమాచారం తెలియడంతో అక్కడకు చేరుకున్న వధువు.. బాదల్ నాయక్‌ను పోలీస్ స్టేషన్‌లోనే చెప్పుతో కొట్టింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
